జైశ్రీరామ్.
అరి షడాదుల ద్వేషింప!ఆధ్యాత్మ విభుదుండునౌ!అనఘు పరమాత్ము
పురము రక్షణ జేకూరు!బోధ్యంబు హరి చింతనౌ!పునరపె వరాల
సురలు దీవన లందింప!శోధ్యంబు పరమం బగున్!సునిశిత సుబోధ
వెరపెరుంగను లేదింక!విద్యాధరులు మెచ్చగన్!వినుతి గను దైవ
సృజనాత్మక గర్భ కవితా స్రవంతియందలి "అనిరుద్ఛందాంతర్గత
ఉత్కృతి"ఛందము లోనిది.ప్రాసనియమము కలదు.
పాదమునకు"26"అక్షరములుండును.యతు
చెల్లును.
1,గర్భగత"-కామాదుల"-వృత్తము.
అరిషడాదుల ద్వేషింప!
పురము రక్షణ జేకూరు!
సురలు దీవన లందింప!
వెరపెరుం గను లేదింక!
అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరము లుండును.
2,గర్భగత"-రక్షణము"-వృత్తము.
ఆధ్యాత్మ విభుదుండునౌ!
బోధ్యంబు హరి చింతనౌ!
శోధ్యంబు పరమంబగున్!
విద్యా ధరులు మెచ్చగన్!
అభిజ్ఞా ఛందమునందలిఅనుష్టుప్ఛందము"-లోని
ప్రాసనియమము కలదు పాదమునకు"8"అక్షరము లుండును.
3,.గర్భగత"-శోధ్యము"-వృత్తము.
అనఘు పరమాత్ము నెంచున్!
పున రపి వరాల నొందున్!
సునిశిత సుబోధ లందున్!
వినుతి గను దైవ ప్రీతిన్!
అభిజ్ఞా ఛందమునందలి"బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"9"అక్షరములుండును
4,గర్భగత"-బోధ్యము"-వృత్తము.
అరి షడాదుల ద్వేషింప!ఆధ్యాత్మ విభుదుండు నౌ!
పురము రక్షణ చేకూరు!బోధ్యంబు హరి చింతనౌ!
సురలు దీవన లందింప!శోధ్యంబు పరమంబగున్!
వెర పెరుంగను లేదింక!విద్యా ధరులు మెచ్చగన్!
అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
5,గర్భగత"-ఆధ్యాత్మిక"-వృత్తము.
ఆధ్యాత్మ విభుదుండునౌ!అరి షడాదుల ద్వేషింప!
బోధ్యంబు హరి చింతనౌ!పురము రక్షణ చేకూరు!
శోధ్యంబు పరమంబగున్!సురలు దీవన లందింప!
విద్యాధరులు మెచ్చగన్!వెర పెరుంగను లేదింక!
అణిమా ఛందమునందలి"-అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు పాదమునకు"17,అక్షరము లుండును.
యతి" 9"వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-అనఘా"-వృత్తము.
అరి షడాదుల ద్వేషింప!అనఘు పరమాత్ము నెంచున్!
పురము రక్షణ జేకూరు!పునరపె వరాల నొందున్!
సురలు దీవన లందింప!సునిశిత సు బోధ లందున్!
వెర పెరుంగను లేదింక!వినుతి గను దైవ ప్రీతిన్!
అణిమాఛందము నందలి"ధృతి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-పునరపి"-వృత్తము.
అనఘు పరమాత్ము నెంచున్!అరి షడాదుల ద్వేషింప!
పునరపి వరాల నొందున్!పురము రక్షణ జేకూరు!
సునిశిత సు బోధ లందున్!సురలు రీవన లందింప!
వినుతి గను దైవ ప్రితదిన్! వెర పెరుంగను లేదింక!
అణిమా ఛందము నందలి "-ధృతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"18"అక్షరములుండు
యతి"10,అక్షరము నకు చెల్లును.
8,గర్భగత"-సునిశిత"-వృత్తము.
ఆధ్యాత్మ విభు దుండునౌ!అనఘు పరమాత్ము నెంచున్!
బోధ్యంబు హరి చింతనౌ!పునరపి వరాల నొందున్!
శోధ్యంబు పరమంబగున్!సునిశిత సు బోధ లందున్!
విద్యా ధరులు మెచ్చగన్!వినుతి గను దైవ ప్రీతిన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును.
యతి"9"వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-వినుతి గను"-వృత్తము.
అనఘు పర మాత్ము నెంచున్!ఆధ్యాత్మ విభుదండు నౌ!
పున రపి వరాల నొందున్!బోధ్యంబు హరి చింతనౌ!
సునిశిత సు బోధ లందున్!శోధ్యంబు పరమంబగున్!
వినుతి గను దైవ ప్రీతిన్!విద్యా ధరులు మెచ్చగన్!
అణిమా ఛందమునందలి"-అత్య ష్టి"ఛందములోనిది.
ప్రాసనియమము కలధు.పాదమునకు"-17,అక్షరము లుండును.
యతి"10,వ యక్షరమునకు చెల్లును.
10,గర్భగత"-పరమం"-వృత్తము.
ఆధ్యాత్మ విభుదుండునౌ!అరి షడాదుల ద్వేషింప!అనఘు పరమాత్ము
బోధ్యంబు హరి చింతనౌ!పురము రక్షణ చేకూరు!పునరపి వరాల
శోధ్యంబు పరమంబగున్!సురలు దీవన లందింప!సునిశిత సు బోధ
విద్యా ధరులు మెచ్చగన్!వెర పెరుంగను లేదింక!వినుతిగను దైవ
అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరములుండు
యతులు"9,19,అక్షరములకు చెల్లును.
11,గర్భగత"-విభుద"-వృత్తము.
అరి షడాదుల ద్వేషింప!అనఘు పరమాత్ము నెంచున్!ఆధ్యాత్మ
పురము రక్షణ చేకూరు!పునరపి వరాల నొందున్!బోధ్యంబు హరి
సురలు దీవన లందింప!సునిశిత సు బోధలందున్!శోధ్యంబు
వెర పెరుంగను లేదింక!వినుతి గను దైవ ప్రీతిన్!విద్యా ధరులు
అనిరుద్ఛందాంతర్గత"-ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19,అక్షరములకు చెల్లును.
12,గర్భగత"-దీవన"-వృత్తము.
అనఘు పరమాత్ము నెంచున్!అరి షడాదుల ద్వేషింప!ఆధ్యాత్మ
పునరపి వరాల నొందున్!పురము రక్షణ చేకూరు!బోధ్యంబు హరి
సునిశిత సు బోధ లందున్!సురలు దీవన లందింప!శోధ్యంబు
వినుతి గను దైవ ప్రీతిన్! వెర పెరుంగను లేదింక!విద్యా ధరులు
అనిరుద్ఛందాంతర్గత"5ఉత్కృతి"ఛం
ప్రిసనియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"10,19"అక్షరములకు చెల్లును.
13,గర్భగత"-వెరపెరుంగని"వృత్తము
ఆద్యాత్మ విభుదుండునౌ!అనఘు పరమాత్ము నెంచున్!అరి షడాదుల
బోధ్యంబు హరి చింతనౌ!పునరపి వరాల నొందున్!పురము రక్షణ
శోధ్యంబు పరమంబగున్!సునిశిత సుబోధ లందున్! సురలు దీవన
విద్యా ధరులు మెచ్చగన్!వినుతి గను దైవ ప్రీతిన్!వెరపెరుంగను
అనిరుద్ఛందాంతర్గత"-ఉతకృతి"ఛం
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు"-9,18,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-వరాంబుధీ"-వృత్తము.
అనఘు పరమాత్ము నెంచన్!ఆధ్యాత్మ విభుదుండు నౌ!అరి షడాదుల
పునరపి వరాల నొందున్!బోధ్యంబు హరి చింతనౌ!పురము రక్షణ
సునిశిత సుబోధ లందున్!శోధ్యంబు పరమంబగున్!సురలు దీవన
వినుతి గను దైవ ప్రీతిన్!విద్యా ధరులు మెచ్చగన్!వెర పెరుంగను
అనిరుద్ఛందాంతర్గత"ఉత్కృతి"ఛం
ప్రాసనియమము కరదు.పాదమునకు"26"అక్షరము లుండును.
యతులు10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.