గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2023, గురువారం

సజ్జనా ఏవ సాధూనాం .... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  సజ్జనా ఏవ సాధూనాం - ప్రథయంతి గుణోత్కరం ౹

పుష్పాణాం సౌరభం ప్రాయ - స్త నుతే దిక్షు మారుతం ౹౹ 

తే.గీ.  సజ్జనులు సాధు సంతులు సరసమతులు,

గుణములను వ్యాప్తి చేసెడి ఘనులు చూడ,  

పంచు  పూ వాసనల్  గాలి వరల దిశల

మంచివారలన్ గాలిగా నెంచవచ్చు.   

భావము.  సజ్జనులు సాధు సంతుల పెద్దరికాన్ని ప్రచారం చేస్తారు.

పువ్వుల సుగంధాన్ని గాలి మాత్రమే అన్నిపక్కలకు వ్యాపింపజేస్తుంది.

గాలికి సజ్జనులకు ఇక్కడ పోలిక ఉంది.సజ్జనులు గాలిలా 

సత్కార్యాలు చేయడములో ఎప్పుడూ ములిగివుంటారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.