జైశ్రీరామ్.
శ్లో. న కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి ।
అతః శ్వః కరణీయాని కుర్యాతద్యైవ బుద్ధిమాన్ ॥
తే.గీ. ఎఱుగఁగా నేరరెవ్వరు నెపుడదేమి
రేపు జరుగనో యనునది, విజ్ఞులార!
బుద్ధిమంతులు చేయుత పుడమిపైన
రేపు చేసెడి దీనాడె ప్రీతితోడ.
భావము. రేపటి రోజున ఎవరికి ఏమి జరుగుతుందో ఎన్నటికీ తెలియదు.
అందుచేత, బుద్ధిమంతుడైన వాడు రేపటి రోజున చేద్దామనుకున్న కార్యాలను
ఈ రోజునే చేయవలెను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.