గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, నవంబర్ 2023, శనివారం

న కార్తిక నమో మాసో ... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.   న కార్తిక సమో మాసో  -  న శాస్త్రం నిగమాత్పరమ్  

నారోగ్య సమముత్సాహం   -  న దేవః కేశవాత్పరః. 

తే.గీ.  కార్తికము మించు మాసము కనఁగ లేదు.

వేదమును మించు శాస్త్రము లేదు మనకు,

నరయనారోగ్యమును మించు హాయి లేదు,

హరిని మించినదైవంబు నరయ లేడు.

భావాము. కార్తిక మాసముతో సమానమయిన మాసము లేదు. 

వేదముతో సమానమగు శాస్త్రము లేదు. రోగము లేకుండా ఉన్నదానికి మించిన 

ఉత్సాహము మరొకటి లేదుకేశవునకు మించిన దైవము మరి లేడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.