జైశ్రీరామ్.
శ్లో. నష్టం ద్రవ్యం లభ్యతే కష్టసాధ్యం,నష్టా
విద్యా లభ్యతే sభ్యాసాయుక్తా ౹
నష్టారోగ్యం సూపచారై: సుసాధ్యం
నష్టా వేలా యా గతా సా గతైవ ౹౹
తే.గీ. నష్ట ధనమది పొందనౌ కష్టపడిన,
చదువు మరచిన పొందనౌన్ జదివి మరల,
స్వాస్త్యమది చెడన్ వైద్యాన సరిగనగును,
గడుచు కాలము మరిరాదు కనుడు నిజము.
భావము.
పోయిన సంపద కష్టపడి మళ్ళీ సంపాదించ వచ్చు.
మరచి పోయిన విద్యను మళ్ళీ చదివితే పొందవచ్చు.
ఆరోగ్యం చెడిపోతే చికిత్సలు చేసి అది కూడా పొందవచ్చు.
అయితే,పోయిన సమయం తిరిగి మనకి దొరకదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.