గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, నవంబర్ 2023, మంగళవారం

సంస్కృతం అంటే ఏమిటి? వివరణ బ్రహ్మశ్రీ బాబూ దేవీదాస్ రావు పండిట్.

 జైశ్రీరామ్.

సంస్కృతం అంటే ఏమిటి? వివరణ బ్రహ్మశ్రీ బాబూ దేవీదాస్ రావు పండిట్.

బ్రహ్మశ్రీ బాబూ దేవీదాస్ రావు పండిట్.

శ్లో.  "సంస్కృతం సంస్కృతం నామ - న పదం వ్యర్థ సంజ్ణికం 

అన్వర్థాక్షర మేతద్ధి - సంస్కరోతీతి సంస్కృతమ్"

సంస్కృత భాషకుగల సంస్కృతమను నామము కేవలం సాంకేతికమూ నిరర్థకమూ గాదు. సార్థకము  " సంస్కారోతీతి సంస్కృతం. " అను నిర్వచనము ఈ భాషయొక్క సార్థకతను దర్షింప జేయుచున్నది. సం  + కరోతి  - ఇట సమ్పరిభ్యాం కరోతౌ భూషణే ; సమవాయే చ " అను పాణిని సూత్రములచే 'సుట్ ' అను ఆగమము చేరి 'సంస్కారోతి ' అను రూపమేర్పడును. అని వ్యాకరణశాస్త్రము చెప్పుచున్నది. " పురుషుని అలంకరించునది. సంఘటిత పరుచునది. అని రెండర్థములు. అనగా ; ఈ భాష పురుషునకు అలంకారమై సంఘీభావమునకు దోహదము చేయునని ఈ నిర్వచనము వలన స్పష్టమగుచున్నది. 

" వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే " 

అనుచు భర్తృ హరియు సంస్కృత శబ్ద నిర్వచనమును తద్భాషా వైశిష్యమును తెలియజేయుచున్నాడు. ఎచట ' ఏకా 'అను శబ్దము మానవుల కలంకార ప్రాయమై భాష ఇది యెక్కటియె ; అని అనిస్పష్టము జేయుచున్నది. 

" యా సంస్కృతా ధార్యతే "

ఈ సంస్కృతమును కేవలము ఇతర భాషలవంటి భాషగానే దర్శించకుడు. దీని యందుగల సంస్కృతత్త్వమును ధర్మమును దర్శించి ధరుంచినపుడే అలంకారమగును. అని అర్థము. నిగమ నిరుక్త వ్యాకరణాదులచే

సు సంస్కృత మైన చిత్తముతో దర్శించినప్పుడు ఈ భాష సువర్ణమయ దివ్య కాంతులను విరజిమ్ముచు దివ్య శోభల వెల్లివిరియజేయుచు దేవభాషయై అమరవాణియై సాక్షాత్కరించును. బాబూ దేవీ దాస్ రావు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.