30, అక్టోబర్ 2023, సోమవారం
మహాజనస్య సంపర్క : ... మేలిమి బంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. మహాజనస్య సంపర్క : - కస్య నోన్నతికారకః ౹
పద్మపాత్రస్థితం తోయం - ధత్తే ముక్తాఫల శ్రియమ్ ౹౹
తే.గీ. మాన్య జనుల సంపర్కమ్ము మహిత గతిని
యీయకుండగ నెట్లుండు? జ్ఞేయముగను,
పర్మపత్ర పాత్రంబుపై పడిన నీటి
బిందువది మౌక్తిక ప్రభ పొందకున్నె?
భావము. మహావ్యక్తుల సంబంధం ఎవరికైనా కానీ తానే ప్రసిద్ధిని ఇవ్వకుండా
ఉండగలదా?అలాగే,పద్మపత్ర అంటే తామరాకు మీద ఉన్నా నీటిబొట్టు
ముత్యంలా ప్రకాశిస్తుంది.
జైహింద్.
29, అక్టోబర్ 2023, ఆదివారం
ఆగమగతి,అపసృతి,ఆగత,పటువిడు,వీడని,గమన,తెగువ,గర్భ"-అనాగత"-వృత్తము. "- అనాగత"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
0 comments
జైశ్రీరామ్
ఆగమగతి,అపసృతి,ఆగత,పటువిడు,వీ
"- అనాగత"-వృత్తము.
ఆగమ మేగతి నేగిన!అనాగతము నాగతమ్!యనుకొన దగదెన్నడున్
సాగెద నామాట నాదని!జనానుమతమారయన్!జనవలె తగినట్టులన్!
నీగతి మూర్ఖత వీడుమ!నీనామము సార్ధకమౌ!నినదము సరియౌనులే!
భోగము సార్ధక మందును!పోనాడకు సు శోభలన్!పునరపిచెడుగౌనులే!
సృజనాత్మక గర్భకవితా ఛందమునందలిఅనిరుద్ఛందాంతర్గతఉత్
ఛందములోనిది.ప్రాసనియమము కలదు.పాదమునకు26అక్షరము
లుండును,10,19,అక్షరములకు యతులు చెల్లును.
1.గర్భగత"-గతిగమన"-వృత్తము.
ఆగమ మేగతి నేగిన!
సాగెద నామాట నాదని!
నీగతి మూర్ఖత వీడుమ!
భోగము సార్ధక మందును!
అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందములోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు9,అక్షరములుండును.
2,గర్భగత"-అనుమతా"-వృత్తము.
అనాగతము నాగతమ్!
జనానుమత మారయన్
నీనామము సార్ధకమౌ!
పోనాడకు సు శోభల్!
అభిజ్ఞా ఛందమునందలి అనుష్టుప్"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు8,అక్షరములుండును.
3.గర్భగత"-నినద"-వృత్తము.
యనుకొన దగ దెన్డున్!
జనవలె తగినట్టులన్!
నినదము సరియౌనులే!
పునరపి చెడుగౌనులే!
అభిజ్ఞాఛందమునందలి బృహతీఛందములోవది.
ప్రాసనియమము కలదు.పాదమునకు9,అక్షరములుండును.
4,గర్భగత"-బోనాల వృత్తము.
ఆగమమేగతి నేగిన!అనాగతము నాగతమ్!
సాగెద నామాట నాదని!జనానుమత మారణన్!
నీగత మూర్ఖము వీడుమ!నీనామము సార్ధకమౌ!
భోగము సార్ధక మందును!పోనాడకు సుశోభల్!
అణిమా ఛందమునందలి అత్యష్టి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును
10,వ యక్షరముతో యతి చెల్లును.
5.గర్భగత"-పూనిక"-వృత్తము.
అనాగతము నాగతమే!యనుకొన దగదెందున్!
జానుమతమారయన్!జనవలె తగి నట్టులన్!
నీనామము సార్ధకమౌ!నినదము సరి యౌనులే!
పోనాడకు సు శోభల్!పునరపి చెడుగౌనులే!
అణిమాఛందమునందలిఅత్యష్టి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును
యతి10,వ యక్షరమునకు చెల్లును.
6,గర్భగత"-బుద్బుధసమ"-వృత్తము.
యనుకొన దగ దెందున్!ఆగమ మేగతి నేగిన!
జనవలె దగి నట్టులన్!సాగెద నామాట నాదని!
నినదము సరి యౌనులే!నీగత మూర్ఖము వీడుమ!
పునరపి చెడుగౌనులే!భోగము సార్ధక మందున్!
అణిమా ఛందమునందలి ధృతిఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును
యతి10,వయక్షరమునకు చెల్లును.
7,గర్భగత"-కడజను"-వృత్తము.
యనుకొన దగ దెందున్!అనాగతము నాగతమే!
జనవలె దగనట్టులన్!జనానుమత మారయన్!
నినదము సరియౌనులే!నీనామము సార్ధకమౌ!
పునరపి చెడు గౌనులే!పోనాడకు సు శోభల్!
అణిమా ఛందమునందలి "-ధృతి"-ఛందములోనిది.
ప్రాసనియమభు కలదు.పాదమునకు18 అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-ఆగమగతి"-వృత్తము.
అనాగతము నాగతమే!ఆగమ మేగతి నేగిన!
జనాను మత మారయన్!సాగెద నామాట నాదని!
నీనామము సార్ధకమౌ!నీగత మూర్ఖము వీడుమ!
పోనాడకు సు శోభల్!భోగము సార్ధకమందున్!
అణిమా ఛందములందలి"-ధృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 18,అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-అపసృతి"-వృత్తము.
ఆగమ మేగతి నేగిన!అనాగతము నా గతమే!
సాగెద నామాట నాదని!జనానుమత మారయన్!
నీగత మూర్ఖము వీడుమ!నీ నామము సార్ధకమౌ-
భోగము సార్ధక మందున్!పోనాడకు సు శోభల్!
10,గర్భగత"-ఆగత"-వృత్తము.
అనాగతము నాగతమే!యనుకొనదగ దెందున్!ఆగమ మేగతి నేగిన!
జనానుమత మారయన్!జనవలె దగినట్టులన్!సాగెద నామాట నాదని!
నీ నామము సార్ధకమౌ!నినదము సరి యౌనులే!నీగత మూర్ఖము వీడుమ!
పో నాడకు సు శోభల్!పునరపి చెడుగౌనులే!భోగము సార్ధక మందున్!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరము లుండును.
10;18,అకషరములకు యతులు చెల్లును.
11.గర్భగత"-పటువిడు"-వృత్తము.
యనుకొనదగ దెందు!ఆగమ మేగతి నేగిన!అనాగతుము నాగతమే!
జనవలె దగినట్టులన్!సాగెద నామాట నాదని!జనానుమత మారయన్!
నినదము సరియౌనులే!నీగత మూర్ఖము వీడుమ!నీనామము సార్ధకమౌ!
పునరపి చెడుగౌనులే!భోగము సార్ధక మందున్!పోనాడకు సు శోభల్!
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది,
ప్రాస నియమము కలదు .పాదమనకు26,క్షరములుండును.
10,19,అక్షరములకు యతులు చెల్లును.
12,గర్భగత"-వీడని"-వృత్తము.
యనుకొన దగదెందు!అనాగతము నాగతమే!ఆగమ మేగతి నేగిన!
జనవలె దగి నట్టలన్!జనానుమత మారయన్!సాగెద నామాట నాదని!
నినదము సరి యౌనులే!నీనామము సార్ధకమౌ!నీగత మూర్ఖము వీడుమ!
పునరపి చెడుగౌనులే!పో నాడకు సు శోభల్!భోగము సార్ధక మందున్!
అనిరుద్ ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది!
ప్రాసనియమము కలదు .పాదమునకు 26 అక్షరములుండును.
9,18,అక్షరములకు యతులు చెల్లును.
13,గర్భగత"-గమన"-వృత్తము.
అనాగతము నాగతమే!ఆగమమేగతి నేగిన!యనుకొన దగ దెందు!
జనానుమతమారయన్!సాగెద నామాట నాదని!జనవలె దగినట్టులన్!
నీనామము సార్ధకమౌ!నీ గత మూర్ఖము వీడుమ!నినదము సరియౌనులే!
పోనాడకు సుశోభల్!భోగము సార్ధక మంచున్!పునరపి చెడుగౌనులే!
అనిరుద్ ఛందమునందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమముకలదు.పాదమునకు 26,అక్షరములుండును.
10,19,అక్షరములకు యతులు చెల్లును.
14.గర్భగత "-తెగుత"-వృత్తము.
ఆగమ మేగతి నేగిన!యనుకొన దగ దెందు!అనాగతము నాగతమే!
సాగెద నామాట నాదని!జనవలె దగి నట్టులన్!జనానుమత మారయన్!
నీ గత మూర్ఖము వీఢుమ!నినదము సరి యౌనులే !నీనామము సార్ధకమౌ!
భోగము సార్ధక మందున్!పునరపి చెడుగౌనులే!పోనాడకు సుశోభల్!
అనిరుద్ఛందము నందలి"-ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరము
లుండును.10,18అక్షరములకు యతి చెల్లును.
జైహింద్.
సురేంద్ర,శ్రీనానా,సుధీరమా,నావీవే,వేమా,గర్భ "-నానార్ధ"-వృత్తము. "-నానార్ధ వృత్తము"- రచన:-వల్లభవఝులఅప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
0 comments
జైశ్రీరామ్.
సురేంద్ర,శ్రీనానా,సుధీరమా,నావీ
నానీ నీనాన నే కానా!నా నానకు నాక మేకము!నౌనే నామానుమను రామా!
నేనే నీ కాన నన్నానే! దునే!నీ నామక మేలు నాకము!నేనా నీమానుసరి వేమా!
మానా నీమానుమౌ నానా!మా నానీ సుమాన వాణివి!మానేనా కాన దిక
శ్రీ నీవే నాన రా నానా!సేనాని సుధీర మీవిక!శ్రీ నావీ వేను విను నానా!
సృజనాత్మక గర్భకవితా స్రవంతి యందలి అనిరుద్"-ఛందాంతర్గత
ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26 అక్షరములుండును..
9,18,అక్షరములకు యతులు చెల్లును.
1.గర్భగత"-నామక"-వృత్తము.
నానీ నీనాన నే కానా!
నేనే నీ కాన నన్నానే!
మా నానీ మానుమౌనాన!
శ్రీనీవే నాన రా నానా!
అభిజ్ఞాఛందమందలి"-అనుష్టుప్"-ఛం
ప్రాసనియమము కలదు,పాదమునకు8,అక్షరములుండును.
2,గర్భగత"-నాకము"-వృత్తము.
నా నానకు నాక మేకము!
నీ నామక మేలు నాకము!
మా నాని సుమాన వాణివి!
సేనాని సుధీర మీవిక!
అభిజ్ఞాఛందము నందలి"-బృహతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 9 అక్షరములుండును,
3.గర్భగత"-సమాన"-వృత్తము.
నౌనే నామానమను రామా!
నేనా నీమాను సరి వేమా!
మానేనా కానదిక సోమా!
శ్రీ నావ వీవేను విను నానా!
అభిజ్ఞా ఛందమునందలి"-బృహతి"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"-9"-అక్షరములుండు
4.గర్భగత"-ఆన"-వృత్తము.
నానీ నీనాన నేకానా!నా నానకు నాక మేకము!
నేనే నీకాన నౌదునే!నీ నామక మేలు నాకము!
మానా నీమాను మౌ నానా!మానాని సుమాన వాణివి!
శ్రీ నీవే నాన రానానా!సేనాని సుధీర మౌ నిక!
అణిమా ఛంధము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరములుండు
9,"అక్షరమునకు యతి చెల్లును.
5.గర్భగత"-సమాన"-వృత్తము.
నా నానకు నాక మేకము!నౌనే నామాను మను రామా!
నీ నామక మేలు నాకము!నేనా నీమాను సరి వేమా!
మా నాని సుమాన వాణివి!మానేనా కానదిక సోమా!
సేనాని సుధీర మీ విక!శ్రీ నావ వీవేను విను నానా!
అణిమా ఛందము నందలి "-ధృతి"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు .పాదమునకు18,అక్షరములుండును.
10,వయక్షరమునకు యతి చెల్లును.
6,గర్భగత"-సేనాని"-వృత్తము.
నౌనే నామాన మను రామా!నానీ నీనాను నేకానా!
నేనా నీమాను సరి వేమా!నేనే నీకాన నౌదునే!
మానేనా కానదిక సోమా!మానా నీమానుమౌ నానా!
శ్రీ నావ వీవేను విను నానా!శ్రీ నీవే రా నానా!
అణిమాఛందమందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17"అక్షరములుండు
10,వ యక్షరమునకు యతి చెల్లును.
7,గర్భగత"-మీవయ"-వృత్తము.
నౌనే నీమాన మను రామా!నా నానకు నాక మేకము!
నేనే నీమాను సరి వేమా!నానామక మేలు నాకము!
మానేనా కానదిక సోమా!మా నాని సుమాన వాణివి!
శ్రీ నావ వీవేను విను నానా!సేనాని సుధీర మీవిక!
అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18 అక్షరములుండును.
యతి10,వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"-కానదిక"-వృత్తము.
నానీ నీనాన నేకానా!నౌనే నామాను మను రామా
నేనే నీ కాన నౌదునే!నేనే నీమాను సరి వేమా!
మా నా నీ మానుమౌ నానా!మానేనా కానదిక సోమా!
శ్రీ నీవే నాన రానానా!!శ్రీ నావ వీవేనునానా!
అణిమాఛందము నందలి"-అత్యష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును
యతి9వయక్షరముతో చెల్లును.
9,గర్భగత"-నేనేనీ"-వృత్తము.
నా నానకు నాక మేకము!నానీ నీ నాన నేకానా!@
నీ నామక మేలు నాకము!నేనే నీకాన నౌదునే!
మా నాని సుమాన విణివి!మానానీ నీమాను మౌనానా!
సేనానీ సుధీర మౌ నిక! శ్రీ నీవే నాన రానానా!
అణిమా ఛందమునందలి"-ధృతి"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును
యతి10,యక్షరముతో చెల్లును.
10,గర్భగత"-సురేంద్రవృత్తము"-
నానానకు నాక మేకము!నౌనే నామాన మను రామా!నానీ నీనాన నేకానా!
నీ నామక మేలు లోకము!నేనా నీమాను సరి వేమా!నేనే నీకాన నౌదునే!
మానాని సుమాన వాణివి!మానేనా కానదిక సోమా!మా నానీమాను మౌ
సేనాని సుధీర మీవిక!శ్రీ నావీ వేను విను నానా!శ్రీ నీవే నాన రా నానా!
అనిరుద్ ఛందము నందలి"--ఉత్కృతి"-ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును
యతులు10,19,యక్షరములకు చెల్లును.
11.గర్భగత"-శ్రీ నానీ"-వృత్తము.
నౌనే నామాన మను రామా!నానీ నీనాన నేకానా!నానానకు నాక మేకము!
నేనా నీమాను సరి వేమా!నేనే నీకాన నౌదునే!నీనామక మేలు నాకము!
మానేనా కానదిక సోమా!మానానీ మానుమౌ నానా!మానాని సుమాను
శ్రీ నావీవేను విను నానా!శ్రీ నీవే నాన రానానా!సేనాని సు ధీర మౌ నిక!
అనిరుద్ ఛందమునందలి"-ఉత్కృతి"-ఛందములోని
ప్రాసనియమము కలదు.పాదమునకు26"అక్షరములుండును
యతులు10,18,యక్షరములకు చెల్లును.
12.గర్భగత"-సుధీరమ"-వృత్తము.
నౌనే నామన మురామా!నానానకు నాక మేకము!నానీ నీనాన నే కానా!
నేనా నీమాను సరి వేమా!నీనామక మేలు నాకము!నేనే నీకాన నౌదునే!
మానేనా కానదిక సోమా!మానానీ సుమాను వాణివి!మానానీ మాను
శ్రీ నీవేను విను నానా!సేనాని సుధీర మీవిక!శ్రీ నీవే నానా రా నానా!
అనిరుద్"-ఛందమునందలి"-ఉత్కృతి ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26 అక్షరములుండును.
యతులు9,18,లకు చెల్లును.
13,గర్భగత"-నావీవే"-వృత్తము.
నానీ నీనాన నేకానా!నౌనే నామాన మను రామా!నానానకు నాక మేకము!
నేనే నీ కాన నౌదునే!నేనా నీమాను సరి వేమా!నీ నామక మేలు నాకము!
మా నానీ నీమానుమౌ నానా!మానేనా కానదిక సోమా!మానానీ సుమాను
శ్రీ నీవే నానా రా నానా!శ్రీ నావీ వేను వినునానా!సేనానీ సుధీరమౌ నిక!
అనిరుద్ ఛందమునందలి "-ఉత్కృతి "-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"26'అక్షరములుండు
యతులు9,18,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-వేమా"-వృత్తము.
నానానకు నాక మేకము!నానీ నీనాన నే కానా!నౌనే నామాన మను రామా!
నీ నామక మేలు నాకము!నేనే నీకాన నౌదునే!నేనా నీమాను సరి వేమా!
మానాని సుమాను వాణివి!మానా నీమాను మౌ నానా!మానేనా కానదిక
సేనానీ సుధీరమౌ నిక!శ్రీ నీవే నానా రా నానా!శ్రీ నావీవేను విను నానా!
అనిరుద్"-ఛందమునందలి"-ఉత్కృతి"-
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును
యతులు10,18,అక్షరములకు చెల్లును.
జైహింద్.
మౌనికుల,ఆశిత,మానుమిక,సుధామాథురీ,సౌరుచి,వరోచిత,సుధామయ ,చెడువిడు గర్భ"-నవమాతృకా"-వృత్తము. "-నవమాతృకా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
0 comments
జైశ్రీరామ్.
మౌనికుల,ఆశిత,మానుమిక,సుధామాథురీ
,చెడువిడు గర్భ"-నవమాతృకా"-వృత్తము.
"-నవమాతృకా"-వృత్తము.
మానవ నవ మాతృక!మావాహయ సారమయా!మానస సరోవరమా!
జ్ఞాన వరదయా శ్రయ!సౌవర్ణ సుథా మధురా!జ్ఞాన సౌదాయమా!
మానుమికను స్వార్ధము!మా"-వాసిత సౌరుచికిన్!మౌనికుల సామమై!
దానవ మెడ నెట్టుమి!తావీవన సాగుమయా!తానుగ వరోచితమై!
సృజనా త్మమక గర్భ కవితా స్రవంతి యందలి"-సంకృతి"- ఛందము
లోని"-అనిరద్"-ఛందము నుండి గ్రహింప బడినది!
ప్రాసనియమము కలదు,పాదమునకు24అక్షరములుండును.
యతులు,9,17,చెల్లును,
1.గర్భగత"-మాతృక"-వృత్తము.
మానవ నవమాతృక!
జ్ఞాన వరదయా శ్రయా!
మాను మికను స్వార్ధము!
దానవ మెడ నెట్టుమి!
అభిజ్ఞా ఛందమునందలి,అనుష్టుప్"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"-8"'అక్షరములుండు
2.గర్భగత "-ఆవాహయ"-వృత్తము.
మావాహయ సారమయా!
సౌవర్ణ సుధా మథురా!
మా"వాసిత సౌ రుచికిన్!
తావీవన సాగుమయా!
అభిజ్ఞా ఛందము నందలి"-అనుష్టుప్"-ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు 8,అక్షరము లుండును.
3.గర్భగత"-సరోవర"-వృత్తము.
మానస సరోవరమా!
జ్ఞాన సముదాయకమా!
మౌనికుల సామజమై!
తానుగ వరోచితమై!
4గర్భగత"-జ్ఞానదాయి"-వృత్తము.
మానవ నవమాతృక!మావాహ సారమయా!
జ్ఞాన వరదయాశ్రయ!సౌవర్ణ సుధా మథురా!
మాను మికను స్వార్ధము!మా"వాసిత సౌరుచికిన్!
దానవ మెడ నెట్టుమి!తా వీవన సాగయా!
అణిమా ఛందమునందలి"-అష్టి"-ఛందములోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"16"అక్షరములుండును
యతి 9,వయక్షరమునకు చెల్లును.
5,గర్బగత"-మాథురీ"వృత్తము.
మావాహయ సారమయా! మానస సరోవరమా!
సౌవర్ణ సుధా మథుర!జ్ఞాన సముదాయకమా!
మా"వాసిత సౌరుచికిన్!మౌనికుల సామజమై!
తావీవన సాగుమయా!తానుగ వరోచితమై!
అణిమాఛందమునందలి" అష్షి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు16,అక్షరములుండును
యతి"9వయక్షరమునకు చెల్లును.
6.గర్భగత"-సముదాయక"-వృత్తము.
మానస సరోవరమా!మానవ నవమాతృక!
జ్ఞాన సముదాయకమా!జ్ఞాన వరదయాశ్రయ!
మౌనికుల సామజమై!మానుమికను స్వార్ధము!
తానుగ వరోచితమై!దానవ మెడ నెట్టుమ!
అణామా ఛందమునందలి"అష్టి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16"అకషరములుండును
యతి"9,వ యక్షరముతో చెల్లును.
7.గర్భగత"-మౌశికుల"-వృత్తము.
మానవ నవమాతృక!మానస సరోవరమా!
జ్ఞానవరదయా శ్రయా!జ్ఞాన సముదాయకమా!
మాను మికను స్వార్ధము!మౌనికుల సామజమై!
దానవ మెడ నెట్టుమ!తానుగ వరోచితమై!
అణిమా ఛందమునందలి"-అష్టిఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16,అక్షరము లుండును!
యతి"9"వ యక్షరమునకు చెల్లును.
8,గర్భగత"--ఆశిత"-వృత్తము
మానస సరోవరమా!మావాహయ సారమయా!
జ్ఞాన సముదాయకమా!సౌ వర్ణ సుధా మథురా!
మౌనికుల సామజమై!మా వాసిత సౌ రుచికిన్!
తానుగ వరోచితమై!తావీవన సాగుమయా!
అణిమాఛందము నందలి"-అష్టి"ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16"అక్షరములుండును
యతి"9"వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"మానుమిక"వృత్తము.
మావాహయ సారమయా!మానవ నవమాతృక!
సౌవర్ణ సుధామథురా!జ్ఞాన వర దయా శ్రయ!
మా"వాసిత సౌరుచికిన్!మాను మికను స్వార్ధము!
తా వీవన సాగుమయా!దానవ మెడ నెట్టుమ!
అణిమా ఛందము నంధలి"అష్టి"ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"16"అక్షరములుండును
యతి"9"వ యక్షరమునకుచెల్లును.
10,గర్భగత"-సుధా మాథురీ"-వృత్తము.
మావాహయ సారమయా!మానస సరోవరమా!మానవ నవమాతృక!
సౌవర్ణ సుధామథురా! జ్ఞానసముదాయకమా!!జ్ఞానవరదయాశ్రయ
మావాసిత సౌరుచికిన్!మౌనికుల సామజమై!మానకను స్వార్ధము!
తృవీవని సాగుమయా!తానుగ వరోచితమై!దానవ మెడ నెట్టుమ!
అనిరుద్ ఛందాంతర్గత"-సంకృతి"ఛందమునందలిది
ప్రాసనియమము కలదు,పాదమునకు 24,అక్షరములుండును.
యతు లు9,17"లకుచెల్లును .
11.గర్భగత"-సౌరుచీ"-వృత్తము.
మానస సరోవరమా!మానవ నవమాతృక!మావాహయ సారమయా!
జ్ఞాన సముదాయకమా!జ్ఞాన వర దయాశ్రయ!సౌవర్ణ సుధా మథురా!
మౌనికుల సామజమై! మానుమికను స్వార్ధము!మా"వాసిత సౌరుచికిన్!
తానుగ వరోచితమై!దానవ మెడ నెట్టుమ!తా వీవన సాగుమయా!
అనిరుద్ ఛందాంతర్గత"సంకృతి ఛందము నందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు24"అక్షరములుండును
యతులు"9,17"లకు చెల్లును.
12.గర్భగత"-వరోచిత"-వృత్తము.
మానవ నవమాతృక!మానస సరోవరమా!మావాహయ సారమయా!
జ్ఞాన వరదయాశ్రయ!జ్ఞాన సముదాయకమా!సౌవర్ణ సుధా మథురా!
మానుమికను స్వార్ధము!మౌనికుల సామజమై!మాతాశ్రిత సౌరుచికిన్!
దానవ మెడ నెట్టుమి!తానుగ వరోచితమై!తావీవన సాగు మయా!
అనిరుద్ఛందాంతర్గత"సంకృతి ఛందమునందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు24"అక్షరములుండును
యతులు"9,17,అక్షరములకు చెల్లును.
13.గర్భగత"-సుధామయ"-వృత్తము
మానస సరోవరమా!మావాహయ సార మయా!మానవ నవమాతృక!
జ్ఞాన సముదాయకమా!సౌవర్ణ సుధా మథురా!జ్ఞాన వరదయాశ్రయ!
మౌనికుల సామజమై!మాతాశ్రిత సౌరుచికిన్!మానుమికను స్వార్ధము!
తానుగ వరోచితమై!తావీవన సాగుమయా!దానవ మెడ నెట్టు మి!
అనిరుద్ఛందాంతర్గత"-"సంకృతి ఛందము నందలిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"24"అక్షరములుండును
యతులు"9"17,అక్షరములకు చెల్లును.
14,గర్భగత"-చెడువిడు"-వృత్తము.
మావా.య సారమయా!మానవ నవమాతృక!మానస సరోవరమా!
సౌవర్ణ సుధా మథురా!జ్ఞాన వర దయాశ్రయ!జ్ఞాన సముదాయకమా!
మాతాశ్రిత సౌ రుచికిన్!మానుమికన స్వార్ధము!మౌనికుల సామజమై!
తావీవన సాగుమయా!దానవ మెడ నెట్టుమి!తానుగ వరోచితమై!
అనిరుద్ఛందాంతర్గత"సంకృతి"ఛందము నందలిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"24"అక్షరములుండును
యతులు."9"17"అక్షరములకు చెల్లును.
జైహింద్.
యథాన్నం మధుసంయుక్తం .... మేలిమి బంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. యథాన్నం మధుసంయుక్తం - మధువాన్యేన సంయుతం ౹
ఏవం తపశ్చ విద్యా చ సంయుక్తం - భేషజం మహత్ ౹౹
తే.గీ. అన్నమందున చేరిన నన్యమందు
చేరినన్ మధు వౌషధ మై రహించు,
నటులె విద్యయున్ దపము నొకటిగనైన
మంగళప్రదమగునది మందువోలె.
భావము.
అన్నంతో మధు చేరినా, లేక మధువే వేరే దేనిలో చేరినా అది ఔషధము
అయిన విధముగనే, విద్య, తపస్సు ఒక్కటి అయినపుడు అన్ని విధములుగనూ
అది మంగళప్రదముగనే ఉంటుంది.
జైహింద్.
28, అక్టోబర్ 2023, శనివారం
నేడు ఆదికవి వాల్మీకి జయంతి. ఈ సందర్భముగా ఆ మహాత్ముని సంస్మరించుచున్నాను.
0 comments
జైశ్రీరామ్.
నేడు ఆదికవి వాల్మీకి జయంతి. ఈ సందర్భముగా
ఆ మహాత్ముని సంస్మరించుచున్నాను.
ఉ. శ్రీకరుఁడైన యాదికవి చిన్మయమూర్తి జనించె నేడె, వా
ల్మీకి, వసంతకోకిలగ మీరుచు కూసెను రామగాధ, సు
శ్లోకుఁడు, శ్లోకబ్రహ్మ, వర సుంద రామ సుధా స్రవంతి, య
స్తోకముగా స్రవించునటు శోభిలఁ జేసెను, వానిఁ గొల్చెదన్.
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
నిష్ణాతోsపి చ వేదాంతే .... మేలిమి బంగారం మన సంస్కృతి
0 comments
జైశ్రీరామ్.
శ్లో. నిష్ణాతోsపి చ వేదాంతే - సాధుత్వం నైతిదుర్జనః
చిరం జలనిధౌ మగ్న : - మైనాక ఇవమార్దవమ్.
తే.గీ. వేదశాస్త్రాదులందు తా వేత్తయగుత
దుష్టుఁడేవిధంబుగనైన శిష్టుఁడగునె?
చాలకాలము మునిగినన్ సంద్రమందు
మృదువగునొకొ మైనాకుఁడు? మృదుల హృదయ!
భావము.
వేదాంత శాస్త్రాలలో ఎంత నిపుణుఁడైనా చెడ్డ స్వభావమున్నవాడు
మంచివాడుకాలేడు. చాలా కాలం నుంచి సముద్రంలో మునిగినా
మైనాక పర్వతం మృదువుగా అవదుకదా.
జైహింద్.
27, అక్టోబర్ 2023, శుక్రవారం
సంపూర్ణకుంభో న కరోతి శబ్దం .... మేలిమి బంగారం మన సంస్కృతి.
0 comments
జైశ్రీరామ్.
శ్లో. సంపూర్ణకుంభో న కరోతి శబ్దం
అర్ధోఘటో ఘోషముపైతినూనం ౹
విద్వాన్కులీనో న కరోతి గర్వం
జల్పంతి మూఢాస్తు గుణైర్విహీనాః ౹౹
తే.గీ. సగము నిండిన కుండ తా సలుపు ధ్వనిని,
నిండుకుం డట్లు చేయదు, నిరుపమాన
పండితుఁడునట్లె వ్యర్థముల్ పలుకఁ బోడు,
పలుకు మూఢుండు గుణహీనుఁడల్పుఁడెపుడు.
భావము.
సంపూర్ణంగా నిండిన కుండ చప్పుడు చెయ్యదు.అర్ధ నిండిన కుండ నిజంగా చప్పుడు చేస్తుంది.అలాగే,మేధావి అయిన విద్వాంసుడు ఎప్పుడూ గర్వము పొందడు.అయితే,సద్గుణులు కాని మూఢులు తమకు ఇష్టమైనట్టుగా మాట్లాడుతారు.
జైహింద్.
26, అక్టోబర్ 2023, గురువారం
అనుభూతి,శ్రీవరాంబుధీ,వీనులవిందు,పాయనేరని,శ్రీనావాణి!వైభోగ, వేనంన్వేలు,గర్భ"-ఆనందానుభవ"-వృత్తము. "-ఆనందానుభవ వృత్తము"- రచన:-వల్లభవఝల అప్పల నరసింహమూర్తి. జుత్తాడ.
0 comments
జైశ్రీరామ్.
అనుభూతి,శ్రీవరాంబుధీ,వీనులవిం
వేనంన్వేలు,గర్భ"-ఆనందానుభవ"-వృ
"-ఆనందానుభవ వృత్తము"-
ఔ భద్రం బభిజ్ఞా అణిమల్!ఆనందాది రుదాదులన్!ఆయా ఛందాల
వైభోగంబునై వెలుంగన్!వీనుల విందు సుశోధనన్!బాయన్నేరంగ
శ్రీ భక్తాను భూతిం సుశోభన్!శ్రీ నావాణి ప్రసన్నతన్!స్వీయాలంకార
భీభత్సంబులున్ద్రోల నౌతన్!వేనంన్వేలు ప్రశంసలన్!వేయించున్
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందు అనిర్ద్ఛందమందలి
ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు. పాదమునకు 26,అక్షరములుండును.
10,18,అక్షరములకు యతి చెల్లును.
1.గర్భగత"-అభిజ్ఞా"-వృత్తము.
ఔభద్రం బభిజ్ఞా,అణిమల్
వైభోగంబునై వెలుగన్!
శ్రీ భక్తాను భూతిం సుశోభన్!
భీభత్సంబులు న్ద్రోల నౌతన్!
అభిజ్ఞా ఛందమునందలి బృహతి ఛందములోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"-9 అక్షరములుండును.
2,గర్భగత"-శోధనా"-వృత్తము.
ఆనందాది రుదాదులన్!
వీనుల్విందు సు శోధనన్!
శ్రీ నా వాణి ప్రసన్నతన్!
వేనం న్వేలు ఫ్రశంసలన్!
అభిజ్ఞా ఛందమందలి "-అనుష్టుప్"-ఛందము లోనిది
ప్రాస నియమము కలదు.పాదమునకు 8,అక్షరములుండును.
3.గర్భగత"-స్వీయాలంకృత"-వృత్తము
ఆ యా ఛందాల పేరిడితిన్!
బాయన్నేరంగ రానటులన్!
స్వీయాలంకార భూష లటుల్!
వేయించున్ శ్రీ వరాంబుధుల్!
అభిజ్ఞా ఛందమునందలి"-బృహతె"-ఛందములోనిది
ప్రాసనియమము కలదు.పాదమునకు"-9"-అక్షరములుండు
4గర్భగత"-అనిరుద్"-వృత్తము.
ఔభద్రం బభిజ్ఞ అణిమల్!ఆనందాదిరుదాదులన్!
వైభోగంబునై వెలుంగన్!వీనుల్విందు సు శోధనన్!
శ్రీ భక్తాను భూతిం సుశోభన్!శ్రీ నా వాణి ప్రసన్నతన్!
భీభత్సంబులు న్ద్రోలనౌతన్!వేనం వేలు ప్రశంసలన్!
అణిమా"-ఛందమునందలి "-అత్యష్టీ"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 17"అక్షరములుండును.
10,వ యక్షరముతో యతి చెల్లును.
5,గర్భగత"-ప్రసన్నతా"-వృత్తము.
ఆనందాది రుదాదులన్!ఆ యా ఛందాల పేరిడితిన్!
వీనుల్విందు సు శోధనన్!బాయన్నేరంగ రానటులన్!
శ్రీ నావాణి ప్రసన్నతన్!స్వీయాలంకార భూషలటుల్!
వేనం న్వేల ప్రశంశలన్!వేయించున్ శ్రీ వరాంబుధుల్!
అణిమా ఛందమునందలి"-అత్యష్టీ"-ఛందములో
ప్రాసనియమము కలదు.పాదమునకు 17,అక్షరములుండును.
9,వ యక్షరముతో యతి చెల్లును.
6,గర్భగత"-ఆలంకార వృత్తము.
ఆయా ఛందాల పేరిడితిన్!ఔభద్రం అభిజ్ఞ అణిమల్!
బాయన్శేరంగ రానటులన్!వైభోగంబునై వెలుంగన్!
స్వీయాలంకార భూషలటుల్!శ్రీ భక్తాను భూతిం సుశోభన్!
వేయించున్ శ్రీ వరాంబుధుల్!భీభత్సంబులు న్ద్రోల నౌతన్!
అణిమా ఛందమందలి"-ధృతి"-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును
10,వ యక్షరమునకు యతి చెల్లును.
7,గర్భగత"-వరాంబుధీ"-వృత్తము.
ఆయా ఛందాల పేరిడితిన్!ఆనందానిరుదాదులన్!
బాయంన్నేరంగ రానటులన్!వీనుల్విందు సు శోధనన్!
స్వీయాలంకార భూషలటుల్!శ్రి నా వాణి ప్ర సన్నతన్!
వేయించున్ శ్రీ వరాంబుధుల్!వేనం న్వేలు ప్రషశంశలన్!
అణిమా"-ఛందమునందలి"-అత్యష్టీ ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు"17,అక్షరములుండు
10,యక్షరముతోయతి చెల్లును.
8,గర్భగత"-అనుభూతి"-వృత్తము.
ఆనందాదిరుదాదులన్!!ఔభద్రం బభిజ్ఞ అణిమల్!!
వీనుల్విందు సుశోధనన్!వైభోగంబునై వెలుంగన్!
శ్రీ నా వాణి ప్రసన్నతన్!శ్రీ భక్తాను భూతిం సుశోభన్!
వేనం న్వేలు ప్రశంశలన్!భీభత్సంబులు న్ద్రోల నౌతన్!
అణిమా ఛందము నందలి"-అత్యష్టి"-ఛందము లోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు17,అక్షరములుండును
9,వయక్షరముతో యతి చెల్లును.
9,గర్భగత"-శ్రీవరాంబుధీ"-వృత్
ఆయా ఛందాల పేరిడితిన్! ఔభద్రం బభిజ్ఞ అణిమల్!
బాయన్నేరంగ రానటులన్!వైభోగంబునై వెలుంగన్!
స్వీయాలంకార భూషలటుల్!శ్రీ భక్తాను భూతిం సు శోభన్!
వేయించున్ శ్రీ వరాంబుధుల్!భూతంబులు న్ద్రోల నౌతన్!
అణిమాఛందమునందలి"-ధృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు18,అక్షరములుండును
యతి10,వ యక్షరమునకు చెల్లును.
9,గర్భగత"-వీనులవిందు"-వృత్తము.
ఆనందాది రుదాదులన్!ఆయా ఛందాల పేరిడితిన్!ఔ భద్రం అభిజ్ఞ
వీనుల్విందు సుశోధనన్!బాయన్నేరంగ రా నటులన్!వై భోగంబునై
శ్రా నా వాణి ప్రసన్నతన్!స్వీ యాలంకార భూషలటుల్!శ్రీ భక్తాను
వేనంన్వేలు ప్రశంశలన్!వేయించున్ శ్రీవరాంబుధుల్!భీభత్సంబులు
అనిరుద్ఛందమందలి"-ఉత్కృతి "-ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరములుండును.
9,18,అక్షరములకు యతులు చెల్లును.
10,గర్భగత"-బాయనేరని"-వృత్తము.
ఆయాఛందాల పేరిడితిన్!ఔభద్రం బభిజ్ఞ అణిమల్!ఆనందాది రుదా
బాయన్నేరంగ రానటులన్!వైభోగంబునై వెలుంగన్!వీనుల విందు సు
స్వీయలంకార భూషలటుల్!శ్రీభక్తాను భూతిం సు శోభన్!శ్రీవాణినా
వేయించున్ శ్రీవరాంబుధుల్!భీభత్సంబులున్
అనిరుద్ఛందమందలి "-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు 26,అక్షరములుండును.
10,19,యతులు చెల్లును.
11,గర్భగత"-శ్రీనావాణి"-వృత్తము
ఆయాఛందాల పేరిడితిన్!ఆనందాది రుదాదులన్!ఔభద్రంబభిజ్ఞ
బాయన్నేరంగ రానటులన్!వీనుల్విందు సుశోధనన్!వైభోగంబునై
స్వీయలంకార భూషలటుల్!శ్రీనావాణి ప్రసన్నతన్!శ్రీభక్తాను భూతిం
వేయించున్ శ్రీవరాంబుధుల్!వేనంన్వేలు ప్రసంశలన్!భీభత్సంబులు
అనిరుద్ఛందమందలి"-ఉత్కృతి"-ఛం
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును
10,19,అక్షరములకు యతి చెల్లును.
12,గర్భగత"-వైభోగ"-వృత్తము.
ఆనందాది రుదాదులన్!ఔభద్రం బభిజ్ఞ అణిమల్!ఆయా ఛందాల
వీనుల్విందు సుశోధనన్!వైభోగంబునై వెలుంగన్!బాయన్నేరగ
శ్రీనావాణినా ప్రసన్నతన్!శ్రీభక్తాను భూతిం సుశోభన్!స్వీయాలంకార
వేనం న్వేలు ప్రశంశలన్!భీభత్సంబులు న్ద్రోల నౌతన్!వేయించన్
అనిరుద్ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు.పాదమునకు26,అక్షరములుండును
10,18,అక్షరములకు యతి చెల్లును.
13గర్భగత"-వేనంన్వేలు"-వృత్తము.
ఔభద్రం బభిజ్ఞ అణిమల్!ఆయాఛందాల పేరిడితిన్!ఆనందాది
వైభోగంబునై వెలుంగన్!బాయన్నేరంగ రానటులన్!వీనుల్విందు సు
శ్రీభక్తాను భూతింసు శోభన్!స్వీయాలంకార భూషలటుల్!శ్రీవాణినా
భీభత్సంబులు న్ద్రోల నౌతన్!వేయించున్ శ్రీవరాంబుధుల్!వేనంన్వేలు
అనిరుద్ ఛందమునందలి"-ఉత్కృతి ఛందములోనిది.
ప్రాసనియమము కలదు,పాదమునకు26 అక్షరములుండును.
10,18,అక్షరములతో యతిచెల్లును.
జైహింద్.
25, అక్టోబర్ 2023, బుధవారం
మన ఆంధ్ర అయోధ్య...| Exploring Vizianagaram Sri Ramanarayanam Temple | Ba...
0 comments
బ్రహ్మశ్రీ బాబూ దేవీదాసురావుగారి రామకథోపనిషన్నవనీతము.... అవధాన ప్రాచార్య , అభినవ మల్లినాథ ,పురాణ వాచస్పతి ,పద్యకళా తపస్వి , డా.ధూళిపాళ మహాదేవమణి. రాజమహేంద్రి.
1 comments
జైశ్రీరామ్.
రామకథోపనిషన్నవనీతం🌹
📍 అవధాన ప్రాచార్య , అభినవ మల్లినాథ ,పురాణ వాచస్పతి ,పద్యకళా తపస్వి ,
డా.ధూళిపాళ మహాదేవమణి.రాజమహేంద్రి.
************
📍"వేదః ప్రాచేతసాదాసీత్
సాక్షా ద్రామాయణాత్మనా"📍
అని వేదాల అవతరణం గూర్చి చెప్పారు వాల్మీకంలో.
వేదములచే తెలుసుకోదగిన పరమపురుషుడే దశరథ రామునిగా అవతరిస్తే అట్టి పరమాత్మను ఉట్టంకించే వేదమే రామాయణంగా అవతరించిందన్నారు.
వేద శబ్దానికి 1 "విద్యతే " అన్న వ్యుత్పత్తి లో సత్త అనీ , 2 "వేత్తి" అన్నవ్యుత్పత్తి లో జ్ఞానమనీ 3" విన్తే" అన్న ధాతు నిష్పత్తిలో విచారణ అనీ 4.విందతే , విందతి అన్ననిర్వచనాల్లో ప్రాప్తి లేక లాభము అనీ అర్థాలు ప్రసిద్ధాలు..వేదశబ్దానికున్న ఈ అర్థాలన్నీ రామాయణంలో అన్వయిస్తాయి.కనుక వేదం అంటే కర్మ జ్ఞాన సిద్ధాంతాలను బోధించే వాఙ్మయ సమాహారమని అర్థం.రామాయణం లో కర్మద్వారా బ్రహ్మమును చేరే మార్గం మనం పొందగలమని "సాక్షాద్రామాయణాత్మనా" అని చెప్పబడింది.సామాన్యులమైన మనకు ఇదే సులభ మార్గం.
ఆర్ష విద్యా నిష్ణాతులు శ్రీ దేవీ దాసుగారు మరో అడుగు ముందుకు వేస్తూ తమ ఈ గ్రంథానికి "రామాయణోపనిషత్" అని నామకరణం చేసి పాఠకులకు ఈగ్రంథ పఠనం వల్ల సాక్షాత్తుగా బ్రహ్మప్రాప్తి కలుగుతుందని భరోసా ఇస్తున్నారు. ఇంతకంటే మనకు కావలిసిందేముంది ? ఇలా సామాన్యులు అనలేరు.ఒక్కదేవీ దాసు గారే అనగలరు.
వారి పేరులోనే ఉంది ఆగొప్పతనం.పేరు అందరూ నిలబెట్టుకో లేరు పేరు.పేరు వల్ల మనకు కీర్తి కలగడం కాదు.మనమే పేరుకి పేరు తేవాలన్నది ఈకవి పరమేశ్వరుని ఆశయం.నిజంగా ధన్య జీవులు వీరు.
అమ్మవారి ప్రసాదంతో కవులకే ఆశ్చర్యం కలిగే
సత్కవనం తో మహాకవి అయ్యారు.
పరమేశ్వరుని యందు అనన్యమైన భక్తితో ఉపాసనతో పండితుల్లోనే మహావిద్వాంసులయ్యారు.
సంవత్సరానికి ఒక కృతికన్యను ఈవయస్సులో కూడా మనకు ప్రసాదిస్తున్నారు. ఇప్పటికే బహుకృతి సుకృతి వీరు.ఆర్షవాఙ్మయాంభోధిని ఆపోశన పట్టిన అగస్త్యులు వీరు. పద్యం ఎంత పగడ్బందీగా వ్రాయాలో అలావ్రాస్తారు.యువకవులు వీరి పద్యప్రౌఢిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఈగ్రంథానికి "ఉపనిషత్ " అని పేరుపెట్టడంలో ఔచిత్యాన్ని మనం ప్రశంసించాలి.
"ఉప + ని "అన్న ఉపసర్గలు పూర్వంగా ఉన్న "షద్ల్ " ధాతువుకు 3అర్థాలు.1విశరణము అనగా శిథిలంచేయడం.2.గతి .అనగా జ్ఞానం
3 ప్రత్యవసాదనం. అంటే నాశనంచేయడం.
ఇందు మొదటి అర్థంవల్ల సంసార పంకం లో కూరుకు పోకుండా జన్మపరంపను కత్తిరిస్తుంది.రెండవ దానివల్ల జన్మలు పోవడంతో ముక్తి జ్ఞానం కలుగుతుంది.3 వ.అర్థం వల్ల కర్మలన్నీ నశించి జీవన్ముక్తులౌతారు.
ఈ ఉపనిషదర్థం శ్రీ దేవీదాసుగారి ఈకృతిలో భాసిస్తూనే ఉంటుంది . దానికి అనుగుణంగానే పుస్తకం తెరిచిన వెంటనే " ఆనందవల్లి " అన్నశీర్షిక కనబడి ఉపనిషత్ ప్రాంగణంలో కి అడుగు పెడతాం.
ఆవెంటనే ఇద్దరు ఆధ్యాత్మిక విద్యా గురువుల్ని ఏకలక్ష్య భూతుల్ని చేసి మనకు అద్భుతంగా ఇలా అందించారు.
"📍ఒకటే తేజము రెండు రూపములతో
వ్యోస్థలిన్ వెల్గదే
ఒకటే లక్ష్యము రెండు మార్గములుగా
నుర్విన్ ప్రకాశింపదే
ప్రకటంబౌ గురులీ వశిష్ట వర విశ్వామిత్రు
లధ్యాత్మ బో
ధకు లానంద విహారు లార్యులు జగత్కళ్యాణ
సంధాతలున్ 📍3
ఇందులో ద్వైతం అద్వైతంగా ఎందుకోసం అవతరించిందో !స్పష్టంగా చెప్పారు. ఏ సిద్ధాంతం చూసినా మార్గాలు వేర్వేరు అయినా లక్ష్యం ఒక్కటే సుమా అని ఎంతో అందంగా ప్రకటించారు.
ఏస్థితి లోనైనా సాధన ఎలా ఉండాలో విశ్వామిత్రుణ్ణి మిషగా చేసి ఇలా చెప్పారు కవి.
📍కనులు మూసిన రాముడే కానిపించు
కనులు తెరచిన రాముడే కానిపించు
రాముడే లేని దేశ కాలంబు లేవొ
తెలియదంచు స్వప్నంబున తేలె మౌని📍55
అంతటా అన్ని అవస్థల్లోనూ బ్రహ్మనే దర్శించాలన్న ఉపనిషత్ సందేశమే ఇది.
నట్టడవిలోకి తనవెంటవచ్చి కటిక నేలపై పరుండిన రామలక్ష్మణుల ను చూసి ఆసౌందర్య పరానందంలో పరవశించిన విశ్వామిత్రుని స్థితి అది.
ఇలా పద్యరామాయణ ఉపనిషన్నవనీతాన్ని అందిస్తున్నారు దేవీదాస కవివరేణ్యులు.
ఈపద్యాలు రస హృదయంతో చదివి ఔపనిషదిక సారాన్ని అనుభవించాలి తప్ప ఒకటి రెండు పద్యాలు సూచించడం కాదు. చదివిన పాఠకులు విశ్వామిత్రుని లా ఆనందవల్లిని అందుకొని తీరుతారు.
శ్రీమద్రామాయణం రెండు భాగాలు చేసిపూర్వ భాగం 1145 పద్యాలతో మనకందించారు. ఇప్పుడీకవి చంద్రములు.ఇది దేవీదాస రామాయణం. మిగిలిన ఉత్తరభాగం కూడా మనకు త్వరలో అందించాలని కోరుతూ శ్రీదేవీదాసుగారిని హృదయమిచ్చి ప్రశంసా అభినందనలు తెలియ జేస్తున్నాను.
ధూళిపాళ మహాదేవమణి.9494002247📍
జైహింద్.
23, అక్టోబర్ 2023, సోమవారం
ఓం సిద్ధిదాత్ర్యై నమః. శరన్నవరాత్రులలో 9వ రోజు.
0 comments
శ్లో. సిద్ధ గంధర్వ యక్షాద్యై - రసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్ - సిద్ధిదా సిద్ధిదాయినీ.
తే.గీ. అసుర గంధర్వ యక్షులు నమరవరులు,
సిద్ధులున్ సేవఁ జేయుచు సిద్ధదాత్రి
కృపకుపాత్రులై యొప్పుదురిట్టి జనని
యత్నసంసిద్ధి మనకిచ్చి యాదుకొనుత.
9.సిద్ధిదాత్రీ సిద్ధి అనగా ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే ఇచ్చేది.
భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక,
జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగల తల్లి.
శరన్నవరాత్రులలో 9వ రోజగు నేడు
మన హృదయములో నెలకొని యున్న అమ్మవారు
సిద్ధిదాత్రిగా మనలను కరుణించి కాపాడుచూ, ఇహపరసౌఖ్యాలననుగ్రహిస్తుంది.
అట్టి అమ్మకు ప్రణమిల్లుచు
మీకు నా శుభాకాంక్షలు తెలియఁజేయుచున్నాను.
జైహింద్.
22, అక్టోబర్ 2023, ఆదివారం
మహాగౌర్యై నమః. శరన్నవరాత్రుల్లో 8వ రోజు
0 comments
తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా
20, అక్టోబర్ 2023, శుక్రవారం
ఓం కాలరాత్ర్యై నమః. శరన్నవరాత్రులలో 7వ రోజు.
0 comments
ఓం కాత్యాయన్యై నమః.
0 comments
జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులలో ఆరవ రోజయిన
నేడు అమ్మ మన హృదయాలలో కాత్యాయనీదేవి రూపంలో
కరుణిస్తుంది. ఈ తల్లిని మనసారా సేవించి మన జన్మసార్థకం చేసుకుందాం.
అమ్మ మన ఆర్తిని తీర్చుగాక.
ఓం కాత్యాయన్యై నమః.
6కాత్యాయనీ దేవి
శ్లో. చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ.
తే.గీ. చంద్రహాసోజ్వలత్కర, జయనిధాన,
రూక్షశార్దూలవాహనారూఢ, జనని,
దుష్టదానవ ఘాతిని, శిష్టరక్ష,
వినుత కాత్యాయని శుభద వేల్పుఁగొలుతు.
అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ ||
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవి ||
సావిత్రీ నవయౌవనా శుభకరీ సాంరాజ్య లక్ష్మీప్రదా ||
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||
6. కాత్యాయనీ పూర్వకాలంలో కాత్యాయనుడు అనే మహర్షి ఉండేవాడు.
తనకు సంతానం కలగలేదు. తను దుర్గా దేవికి గొప్ప భక్తుడు. ఆయన
ఘోర తపస్సు చేసి తన కుమార్తెగా అమ్మవారు జన్మించాలని
కోరుకుంటాడు. ఈ సందర్భంగా ఆ మహర్షి కోరిక అమ్మవారు
నెరవేర్చింది. దుర్గా దేవికి సంబంధించిన రూపాల్లో
కాత్యాయనీ మాతది అత్యంత హింసాత్మక రూపాలలో
ఒకటిగా పరిగణించబడుతుంది. మహిషాసురుడు
అనే రాక్షసుడిని కాత్యాయని అమ్మవారే వధించారు.
అందుకే ఈఅమ్మవారిని మహిషాసురమర్దిని అని పిలుస్తారు.
ఈ తల్లి సింహంపై స్వారీ చేస్తుంది.
కాత్యాయనీ దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసే తల్లి.
జైహింద్.