గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, ఫిబ్రవరి 2022, శనివారం

జ్యాయసీ చేత్కర్మణస్తే మతాII 3.1 II,,//,,వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం || 3-2 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 

జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

II 3.1 II

అర్జున ఉవాచ|

జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన|

తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ!

తే.గీ. నీ మతంబున కర్మయే నిత్యమధిక

మయిన జ్ఞానము కన్న మహాత్మ! కృష్ణ!

ఘోర కర్మలందేల నన్  కోరి నిలిపు

చుంటవో తెల్పు మనుపమ! సుప్రకాశ!

భావము.

అర్జునుడు విధముగ పలికెను.

జనార్ధనా! నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవా! ఘోరకర్మలో 

నన్ను ఎందుకు నియోగించుతావు?

|| 3-2 ||

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే|

తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోహమాప్నుయామ్

తే.గీ. భ్రాంతిఁ గల్గించుచుంటివి పలికి నీ

యోమయంబైన మాటల నో మహాత్మ!

శ్రేయమెయ్యది నాకదే చెప్పుమయ్య!

నిశ్చితంబుగ, తెలియగ, నేర్పుమీర.

భావము.

అయోమయమైన మాటలతో నా బుద్ధికి భ్రాంతిని కలిగించుచుంటివి. ఏది నాకు 

శ్రేయమో దానిని నిశ్చయముగా చెప్పుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.