గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఫిబ్రవరి 2022, ఆదివారం

లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా..|| 3-3 ||..//..న కర్మణా మనారమ్భా న్నై..|| 3-4 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-3 ||

శ్రీభగవానువాచI

 శ్లో. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|

జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం, కర్మయోగేన యోగినామ్.

తే.గీ. జ్ఞాన యోగంబు చేత నా సాంఖ్యులకును,

కర్మయోగంబు చేత నా కర్మయోగు

లకును, సృష్టికిన్ ముందుగా సకల మెఱుఁగ

చెప్పఁ బడెనయ్య నా చేత గొప్పగాను.

భావము.

భగవంతుడు ఇలాపలికాడు;

పాప రహితుడా లోకంలో సాంఖ్యులకు జ్ఞానయోగం చేతను యోగులకు 

కర్మయోగం చేతను సాధన, సృష్టికి ముందే నాచేత చెప్పబడినది.

|| 3-4 ||

శ్లో. కర్మణా మనారమ్భా న్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే|

సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి.

తే.గీ. కర్మలను చేయనంత నిష్కర్మ సిద్ధి

కలుగఁ బోవదు తెలియుమా కవ్వడి! మరి

సన్యసించిన మాత్రాన సాధ్య మవదు

సిద్ధిఁ బొందుట, కనఁగ ప్రసిద్ధమిదియె.

భావము.

కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు. కేవలం సన్యసించడం 

వలన సరైన సిద్ధి కలగదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.