గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

విషయా వినివర్తంతే.. || 2.59 || ..//..యతతో హ్యపి కౌంతేయ.. || 2.60 || ..//..సాంఖ్య యోగము.

 జైశ్రీరామ్.

శ్లో.  విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |

రసవర్జం రసో௨ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే || 59

తే.గీ. భువి నిరాహారుఁడగువాని విషయవాంఛ

లణగిపోవచ్చు నపుడైన నణగిపోవు

విషయ వాసనలతనికి, విదితమగుచు

నాత్మదర్శనమగునేని యణగునదియు

భావము.

ఆహారం తీసుకోనివాడికి ఇంద్రియవిషయాలు అణగిపోతాయి. అయితే 

విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా 

అడుగంటిపోతుంది.

శ్లో.  యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః |

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః || 60

తే.గీ. ఆత్మనిగ్రహాసక్తిటో యమిత గతిని

యత్నమొనరించు మహితుని యాత్మనైన 

లొంగదీయు నింద్రియతతి డోలనమున

భ్రష్టుఁడైచెడువచ్చంఉ పార్థ! వినుమ.,

భావము.

కుంతీనందనా ! ఆత్మనిగ్రహం కోసం అమితంగా ప్రయత్నించే

 విద్వాంసుడి  మనసును సైతం ఇంద్రియాలు బలవంతంగా లాగుతాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.