గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2022, సోమవారం

నాస్తి బుద్ధిరయుక్తస్య..//..2 . 66..//..ఇంద్రియాణాం హి చరతాం ..//...2 . 67..//..సాంఖ్యయోగము.

 జైశ్రీరామ్.

శ్లో.నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా |

న చాభావయతశ్శాంతిః అశాంతస్య కుతస్సుఖమ్ || 66

తే.గీ. మనసు నిగ్రహంబది లేని మానవునకు

ఆత్మ చింతన, జ్ఞానము నలవడవిల,

వాని కుండదు శాంతి యవ్వాని కెఱుఁగ

సుఖము లభియింప నేరదు, శూన్యసుఖుఁడె.

భావము.

మనోనిగ్రహం లేనివాడికి ఆత్మవివేకం కాని ఆత్మచింతన కాని అలవడవు. 

అలాంటివాడికి మనశ్శాంతి వుండదు. మనశ్శాంతి లేనివాడికి సుఖం 

శూన్యం.

శ్లో. ఇంద్రియాణాం హి చరతాం యన్మనో௨ను విధీయతే |

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి || 67

తే.గీ. నావ చుక్కాని లేనిచో నాశనమగు

ను సుడి గాలిచే, యటులె మనుజులును తమ

యింద్రియాసక్తులకులొంగెనేని యదియె

ప్రజ్ఞనే నాశనము చేయు పార్థ! వినుము.

భావము.

సుడిగాలి చుక్కాని లేని నావను దిక్కుతోచకుండా చేసినట్లు, ఇష్టానుసారం 

ప్రవర్తించే ఇంద్రియాలకు లొంగిపోయిన మనస్సు పురుషుడి బుద్ధిని 

పాడు చేస్తుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.