గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఫిబ్రవరి 2022, శనివారం

ప్రజహాతి యదా కామాన్.. || 2 . 55 || ..//..దుఃఖేష్వనుద్విగ్నమనాః .. || 2. 56 || .. //..సాంఖ్య యోగము.

 జైశ్రీరామ్.

శ్రీ భగవానువాచ:

శ్రీకృష్ణ భగవానుఁడనుచున్నాడు.

శ్లో.  ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ |

ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే || 55

తే.గీ.  మనసు లోపలి కోరికల్ మనుజుఁడెవడు 

విడిచిపెట్టుచు భువిపైన వెలుగుచుండు

కన స్థితప్రజ్ట్ణుఁడతఁడెయౌ కనుము మదిని,

కని స్థితప్రజ్ణుడై వెల్గుఘనతరముగ.

భావము.

మనసులోని కోరికలన్నిటినీ విడిచిపెట్టి, ఎప్పుడూ ఆత్మానందమే 

అనుభవించేవాడు  స్థితప్రజ్ఞుడు.

శ్లో.  దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః |

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే || 56

తే.గీ.  కష్ట సమయంబులందునఁ గలత పడక,

సుఖములందున పొంగక శోభనొప్పు

సతము విగతరాగద్వేషు డతులిత మతి

స్థిర శుభమతిని మునియందు రరయుమయ్య.

భావము.

దుఃఖాలకు క్రుంగనివాడూ, సుఖాలకు పొంగనివాడూ, భయమూ,

 రాగద్వేషాలూ వదిలిపెట్టినవాడూ అయిన మునీంద్రుడు 

స్థితప్రజ్ఞుడవుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.