గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

రాగద్వేషవియుక్తైస్తు..//2.64..//..ప్రసాదే సర్వదుఃఖానాం ..//..2 / 65..//..సాంఖ్య యోగము.

 జైశ్రీరామ్.

శ్లో. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ |

ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి || 64

తే.గీ. నిగ్రహ మతితో నింద్రియ నిగ్రహమున

నదుపుకల్గివర్తించువా డెదను సౌఖ్య

శాంతు లందుచు సుఖియించు సన్నుతముగ,

ఇంద్రియాతీతవశ్యాత్ముఁడెన్న ఘనుఁడు.

భావము.

మనసును నిగ్రహించుకుని రాగద్వేషాలు లేకుండా తన అదుపాజ్ఞలలో 

వున్న ఇంద్రియాల వల్ల విషయసుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతి 

పొందుతాడు.

శ్లో. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే |

ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ||65.

తే.గీ. అతని దుఃఖము లన్నియు నావిరియగు 

దైవ కృపఁ గల్గియున్నచో ధరణిపైన,

భువి ప్రశాంత చిత్తుని బుద్ధి నిలుచియుండు

స్థిరముగాను ప్రశాంతిగా త్వరగ నిజము.

భావము.

ఈ విధముగా తృష్ణచైతన్యముతో తృప్తి పొందిన వాడికి భౌతిక జీవతమునకు 

సంబందించిన త్రివిదములైన క్లేషములు కలుగవు. సంతృప్తితో కూడిన 

అట్టి చైతన్యంలో మానవుని బుద్ధి సీగ్రముగా తప్పక సుప్రతిష్టితమగును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.