జైశ్రీరామ్.
శ్లో. శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి || 53
తే.గీ. అర్థవాదాలనేకములాలకించి
సంచలించిన నీ మది సన్నుతముగ
నిశ్చలస్థితిపొందిన నిశ్చయముగ
ఆత్మసుజ్ణానమునుపొంది యలరఁగలవు.
భావము.
అర్థవాదాలు అనేకం వినడం వల్ల చలించిన నీ మనస్సు నిశ్చలంగా
వున్నప్పుడు నీవు ఆత్మజ్ఞానం పొందుతావు.
అర్జున ఉవాచ:
అర్జునుఁడు పలుకుచుండెని.
శ్లో. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత? కిమాసీత? వ్రజేత కిమ్? || 54
తే.గీ. హరి! సమాధిస్థితినియుండి యలరువాని
లక్షణములెట్టులుండును? శ్లాఘనీయ!
అతని మాటలు చేష్టలు నలరునెటుల?
ననుచు పార్థుండు పలికెను, వినగ నెంచి.
భావము.
కేశవా ! సమాధినిష్ఠ పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలేమిటి? అతని
ప్రసంగమూ, ప్రవర్తనా ఎలా వుంటాయి?
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.