గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఏప్రిల్ 2020, సోమవారం

పొమ్ము కరోన రక్కసీ. రచన...చింతా రామకృష్ణారావు

జైశ్రీరామ్.
జైశ్రీమన్నారాయణ🙏🏻
ఆర్యులకు నమస్సులు.
 కవితాంశము 
కరోనా.

శా. శ్రీమన్మంగళ భారతావని సదా శ్రీమంతమై యొప్పఁగా
ధీమంతుల్ శుభ సంప్రదాయములనే దీపింపగా గొల్పుటన్
క్షేమంబున్ జనులందరున్ వరలి రా చిన్మార్గమున్ వీడుచున్
నీమంబుల్ విడ నోకరోన! కలిగెన్ నీకున్ బ్రవేశంబిటన్.

ఉ. భారత భూమి యోగులకుఁ బండిత కోటికి నాలవాలమున్,
ధీర వదాన్య సైనికుల దీధితి. సన్నుత మార్గదర్శి. సు
స్మేరముతో వధానములు చేసెడి ధీవరకోటికల్పకం
బీరమణీయపృథ్వినిటు లేలకృశింపఁగ జేయ వచ్చితో.

 నామ గోపన, భావ గోపన చిత్ర.తేటగీతి. 
ల్పనము చేయఁబోకుమా కాటిసీను.
రోదనములేల గొల్పెదో? రోతకాదొ?
నాయకులమాట మన్నించు నడచిపొమ్ము.
పోయినను నీవు కొలుతుము పూజ్యవనుచు.

ఉ. చేయము దుష్ప్రచారములు. చేయము దుష్పరిణామకృత్యముల్.
చేయము దుష్ట సంగతిని. చేయమకృత్యపు దుష్టబోధనల్.
చేయము శిష్ఠ దూషణలు. చేయము చేయగరాని వన్నియున్
చేయుదుమమ్మ వందనము. శీఘ్రమె పొమ్ము కరోన రక్కసీ!

ఉ. మంగళ మీ జనాళికగు మాన్య వసుంధరకున్ శుభంబులౌన్.
మంగళకారకంబగుత మాన్య కరోన నశీంచిపోవుటన్.
బెంగను వీడి సజ్జనులు ప్రీతిగ మంచిని పెంచుచుండుతన్.
అంజయవంటి సాత్వికుల కహర్నిశలున్ శుభమంగళంబగున్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.