గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మార్చి 2020, సోమవారం

నారాయణ.......దేవీదాసః.

జైశ్రీరామ్.
శ్రీరస్తు
నారాయణంనమస్కృత్యమ్ నరం చైవనరోత్తమమ్
దేవీం సరస్వతీo చైవ తతో జయ ముదీరయేత్
ప్రాణి శరీరములకు పిండాoడ మనియు దృశ్యమగు చరాచరమునకు బ్రహ్మాణ్డమనియు పేరు . పిండాo డమునకు అధినేత అగుటచే జీవునకు నరుడని పేరు . అట్లే బ్రహ్మాణ్డమునకు అధినేతఅగు పరమేశ్వరునకు నరుడని పేరు నరుడగు పరమేశ్వరునినుండి ఆవిర్భవించుటచే ఈ చరాచరమునకు
' నారం 'అనియు వ్యాపకత్వ ధర్మముచే ' ఆపః ' అనియు పేరు. అట్టి నారము నకు  అనగా చరాచరమునకు ఆయనము - అనగా అధిష్టాన రూపుడై వసతిస్థానమగుటచే పరమేశ్వరునలు ' నారాయణ ' అనిపేరు ప్రసిద్ధము. నరనారాయణులగు జీవేశ్వరులు ఇరువురకును స్వరూపభూతుడై యధినేత అగు నిర్గుణ బ్రహ్మమునకును నరః 'పేరు యిట్లు నర , నారాయణ నిర్గుణ బ్రహ్మలు మువ్వురును నరశ్శబ్దవాచ్యులే చేతనుడగుటచే జడవర్గము కంటే జీవుడు ఉత్కృష్టుడు . జీవునికంటే కారణాత్మ యగు నారాయణుడు ఉత్క్రుష్టస్తరుడు
వీరిరువురికంటే " సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ " ఇత్యాది శ్రుతి ప్రతిపాద్య నిర్గుణ బ్రహ్మతత్త్వము ఉత్కృష్టతమము . కావున అట్టి నిర్గుణ తత్త్వము ' నరోత్తమం ' అని యిట కీర్తింపబడుట యుక్తమే. ఇట్టి ఈ - నర - నారాయణ - నరోత్తమ తత్త్వములను ప్రకాశింప జేయుచు సంసార జయమునకు సాధన భూతమైప్రవర్తిల్లిన దగుటచే ఈ మహాభారత మునకు ' జయ ' మని పేరు. మహాభారతమే కాదు ; సర్వ పురుషార్థ ప్రతిపాదకమై సంసార జయమునకు సాధభూతములైన పురాణాదులు శారీరక సూత్ర భాష్యాది గ్రంథములును ' జయ' శబ్ద వాచ్యములే అగును అట్టి గ్రంథములు చదువుటకు ఉపక్రమించు నపుడు నర  నారాయణ  నరోత్తములను తత్తత్వ ప్రకాశిక అగు సరస్వతిని , అట్టి సరస్వతీదేవి అనుగ్రహమునకు పాత్రుడగు వ్యాసుని స్మరించి నమస్కరింపవలెనని పై శ్లోకమునకు సంప్రదాయానుగతమైన అర్థము.
ఈ భారతము మొదటి మంగళ శ్లోకము నర   నారాయణ.  నరోత్తమ తత్త్వములను అనగా జీవేశ్వర బ్రహ్మతత్త్వములను ప్రకాశింపజేయుతల్లి సరస్వతి అని కీర్తింప బడుట గమనార్హము .
సరస్వతీ సాధయన్తీ ధియం నః - ఇత్యాది శ్రుతులు జిజ్ఞాసువుల బుద్దిని సంస్కరించి తత్త్వమునుద్దీపింప జేయు తల్లి సరస్వతి. అని చెప్పుచున్నవి. అట్టి శ్రుత్యర్థమే ఆది మంగళ శ్లోకమున గ్రంథారంభ సమయమున మహర్షిచే తలపింపజేయబడుచున్నది. నీల కంఠ పండితుడును శ్రుత్యర్థానుగుణ్యముగానే పై శ్లోక వ్యాఖ్యానమున సరస్వతీ స్వరూపము నిట్లు వివరించాడు
" దేవీం నరనారాయణ నరోత్తమ తత్త్వ ప్రద్యోతనీంసరస్వతీంచ నమస్కృత్యైవ.
( నీల కంఠ )
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.