గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ధారా,శ్రవంతి,మృదుమానస,ఊహాతీత, మావిపూత,అంతుపట్టని,పరవశ రసయ ద్విజరజరా,నిష్పఠిమా,జీవధాత్రి,గర్భ"-సేంద్రియా"-వృత్తము.. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ధారా,శ్రవంతి,మృదుమానస,ఊహాతీత, మావిపూత,అంతుపట్టని,పరవశ రసయ ద్విజరజరా,నిష్పఠిమా,జీవధాత్రి,గర్భ"-సేంద్రియా"-వృత్తము..
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
             

"-సేంద్రియా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.ర.జ.భ.ర.జ.లగ.గణములు.యతులు.10,19,
ప్రాసనీమముగలదు.
సేంద్రియంబుల వాడకాన!జీవధాత్రి పట్టు గీడ్పడె!చింత కందని జబ్బులన్!
సాంద్ర భూములు బీడులాయె?చావు దప్పి కన్ను లొట్టయె!శాంతమోపని తీరునన్?                                                                                    
మంద్ర ఘోషణ మారు మ్రోగె!మావి మాసె పంటతగ్గెను!మంతనంబులవేలనో?                                                                                      
ఆంధ్రదేశము అన్నపూర్ణ!ఆవు పేడ రొట్టలేకను!అంతమాయెను సశ్యముల్

భావము:-
సేంద్రీయ యెరువులు వాడకమువలన,జీవుల శక్తి సన్నగిల్లెను.వైద్యుల
ఊహకంతుపట్టని రోగములు వచ్చుచుండెను.మంచి సారముగల భూములు
బీడులుగామారిపోయెను.చావు తప్పి కన్ను లొట్టయ్యె ననునట్లు,మనస్సు
నందు శాంతి పట్టని విధముగా మారెను.అతిగంభీరమైన ఆర్త నినాదములు
మారు మ్రోగు చుండెను.మావిడి పూతలేక పొయెను.పంటల దిగుబడి
తగ్గెను.తంగరింపు సారధ్య మెందులకు?అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రావని
యందు,ఆవు పేడ రొట్ట కరువై పంటలు పండవాయెను.

1.గర్భగత"-ధారా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.వృ.సం.347.ప్రాసగలదు.
సేంద్రియంబుల వాడకాన!
సాంద్ర భూములు బీడు లాయె!
మంద్ర ఘోషణ మారు మ్రోగె!
ఆంధ్ర దేశము అన్నపూర్ణ!

2.గర్భగత"-శ్రవంతి"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.భ.గణములు.వృ.సం.427.ప్రాసగలదు.
జీవధాత్రి పట్టు  గీడ్పడె!
చావుదప్పి కన్ను లొట్టయె!
మావి మాసె!పంట తగ్గెను!
ఆవు పేడ ,రొట్ట లేకను!

3.గర్భగత"-మృదు మానస"-వృత్తము.
అను ష్టుప్ఛందము.ర.స.లగ.గణములు.వృ.సం.91.ప్రాసగలదు.
చింతకందని జబ్బులన్!
శాంత మోపని తీరునన్?
మంతనంబు లవేలనో?
అంతమాయెను సశ్యముల్!

4.గర్భగత"-ఊహాతీత"-వృత్తము.
ధృతిఛందము.ర.స.జ.ర.జ.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
సేంద్రియంబుల వాడకాన!జీవధాత్రి పట్టు గీడ్పడె!
సాంద్ర భీములు బీడులాయె!చావుదప్పి కన్ను లొట్టయె!
మంద్ర ఘోషణ మారు మ్రోగె!మావి మాసె!పంట గీడ్పడె!
ఆంధ్రదేశము అన్నపూర్ణ!ఆవు పేడ,రొట్ట లేకను!

5.గర్భగత"-మావిపూత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.భ.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవధాత్రి పట్టు గీడ్పడె!చింత కందని జబ్బులన్?
చావుదప్పి కన్ను లొట్టయె!శాంత మోపని తీరునన్!
మావి మాసె!పంట గీడ్పడె!మంతనంబు లవేలనో?
ఆవు పేడ,రొట్ట లేకను?అంతమాయెను సశ్యముల్?

6.గర్భగత"అంతుపట్టని"-లఘ్వంతము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.ర.స.య.జ.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
జీవధాత్రి పట్టుగీడ్పడె!చింత కందని జబ్బులం?సేంద్రియంబుల వాడకాన!
చావుదప్పి కన్ను లొట్టయె!శాంతమోపని తీరునం!సాంద్ర భూములుబీడులాయె?                                                                                            
మావి మాసె!పంటగీడ్పడె!మంతనంబు లవేలనో?మంద్ర ఘోషణ మారుమ్రోగె!                                                                                            
ఆవు పేడ,రొట్టలేకను?అంతమాయెను సశ్యముల్!ఆంధ్రదేశము అన్నపూర్ణ!                                                                                  

7.గర్భగత"-పరవశ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.జ.జ.గలగుణములు.యతి.9,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
చింతకందని జబ్బులం?సేంద్రియంబుల వాడకాన!
శాంతమోపని తీరునం?సాంద్ర భూములు బీడులాయె!
మంతనంబు లవేలనో?మంద్రఘోషణ మారుమ్రోగె!
అంతమాయెను సశ్యముల్!ఆంధ్రదేశము అన్నపూర్ణ!

8.గర్భగత"-రసయ ద్విజర జరా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.జ.జ.ర.జర.లల..గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
చింతకందని జబ్బులం!సేంద్రియంబుల వాడకాన!జీవధాత్రి పట్టు గేడ్పడె!
శాంతమోపని తీరునం?సాంద్రభూములు బీడులాయె!చావుదప్పి కన్ను లొట్టయె!                                                                                      
మంతనంబు లవేలనో?మంద్ర ఘోషణ మారు మ్రోగె!మావి మాసె,పంటగీడ్పడె!                                                                                        
అంతమాయెను సశ్యముల్?ఆంధ్ర దేశము అన్నపూర్ణ!ఆవు పేడ,రొట్ట లేకను!                                                                                        

9.గర్భగత"-నిష్పఠిమా"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.భ.ర.స.జ.గణములు.యతి 10,వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవధాత్త్రి పట్టు గీడ్పడె!సేంద్రియంబుల వాడకాన!
చావుదప్పి కన్ను లొట్టయె!సాంద్ర భూములు బీడులాయె!
మావి మాసె,పంట గీడ్పడె!మంద్ర ఘోషణ మారు మ్రోగె!
ఆవు పేడ,రొట్ట లేకను! ఆంధ్ర దేశము అన్నపూర్ణ!

10,గర్భగత"-జీవధాత్రి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.భ.ర.స.జ.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
జీవధాత్రి పట్టు గీడ్పడె!సేంద్రియంబుల వాడకాన!చింత కందని జబ్బులన్?
చావుదప్పి కన్ను లొట్టయె!సాంద్రభూములు బీడులాయె!శాంత మోపనితీరునన్?                                                                                      
మావి మాసె!పంటగీడ్పడె!మంద్ర ఘోషణ మారు మ్రోగె!మంతనంబు ల వేలనో?                                                                                      
ఆవుపేడ,రొట్ట  లేకను!ఆంధ్ర దేశము అన్నపూర్ణ!  అంతమాయెను
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
జరుగుతున్న వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు వివరించారు, బాగుంది . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.