గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, సెప్టెంబర్ 2017, గురువారం

సహృదయ మిత్రులు బ్రహ్మశ్రీ జాజి శర్మ.

జైశ్రీరామ్.
 బ్రహ్మశ్రీ జాజి శర్మ.
ఆర్యులారా! ముఖ పుస్తకమున సహృదయ మిత్రులయిన 
బ్రహ్మశ్రీ జాజిశర్మనెఱుఁగనివారుందురని నేను భావింపను. 
అట్టి ప్రసిద్ధ జాజిశర్మ యొక్క వ్యక్తిత్వము ఋజు వర్తకులకాదర్శము. 
ఇందావంతయు సందియము వలదు.
మంచికి ముందడుగు వేసేటప్పుడు ప్రతీ పాదమున 
ప్రథమ స్థానం తనదే అనేలా ప్రవర్తించే వారే బ్రహ్మశ్రీ జాజి శర్మ.
కావాలంటే ఈ క్రింది పద్యంలో ప్రతీ పాదంలో ప్రథమాక్షరాలను కలిపి చూడండి. 
జాజి శర్మ మీకు కనఁబడుట ఖాయం..
ఆ.వె. జాతి చరిత లోన జాజిగా విలసిల్లు,
జితమెకాని యెఱుఁగఁడితరములను.
శక్తియుక్తులొప్ప చరియించు. . . క్రూరక
ర్మలను చేయు ఖలుల మడచునతఁడు.
జైహింద్.
Print this post

5 comments:

అజ్ఞాత చెప్పారు...

వందనశతములు ఓ కవీంద్ర మిత్రమా !!
తెలుగు బ్లాగులలో పేరిన్నికగన్నది "ఆంధ్రామృతం". ఆ బ్లాగులో ఈ చిన్ని మిత్రునకు ఒక ప్రముఖ స్థానమిచ్చి గౌరవమిచ్చిన కవీంద్ర మిత్రులు శ్రీమాన్ చింతా రామకృష్ణారావు గారి ఆప్యాయతానురాగాలకు ప్రణమిల్లుతూ, ఆ ప్రేమ పద్య పాదములు శిరమున ఆశీస్సులుగా దాల్చుతూ వారికి వందనశతములు అర్పిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ !!
జాజి శర్మ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కాంతినొసంగు దీపమును గాలిని సోకక యుండఁ జూచుటన్,
శాంతిని కోరు వారలను సభ్యతతోఁ గని గౌరవించుటన్,
క్రాంతిని గోరు మిమ్మిలను గౌరవమిచ్చి రహింపఁ జేయుటన్
సంతసమబ్బు సత్కవికి. సన్నుత బాంధవ! జాజిశర్మరో!
మీ అభిమానమునకు ధన్యవాదములు జాజిశర్మగారూ! జైశ్రీమన్నారాయణ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చక్కని జాజుల సౌరులు
మక్కువగా పీల్చి నంత మదినే దొచున్
మిక్కిలి పరవశ మొందగ
దక్కును సుఖశాంతు లన్ని తన్మయ మగుచున్

గొప్పవారిని పరిచయం చేసినందులకు ధన్య వాదములు

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు గారికి నమస్కరించుచూ మీద్వారా జాజిశర్మ గారికి నా పద్యపూర్వక నమస్సులు
జాగరిత విధాన పథాన జాతి కెపుడు
జిత్వరుండగుచు దెలుపు జీవితాన
శర్మధ మిడు సువచనముల్ సంతతంబు
ఆట్టి వార్కి శతనతుల అందజేతు.

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

ఆర్యా! మీ cell No. గాని WA నం. గాని తెలుప మనవి. నా cell No. & WA నం. 9346676049. నే ఉండునది కాకినాడలో. శ్రీ పేరి అప్పాజీగారు మీ ఇంటికి వెళ్ళినానని చెప్పినారు. అలాగే శ్రీ వేపా పార్వతీశంగారు మీకు బాగా సన్నిహితులని చెప్పినారు. నమస్సులతో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.