గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఏప్రిల్ 2016, శుక్రవారం

యాదాద్రి లక్ష్మీనరసింహ . . . జి.బాలకృష్ణప్రసాద్, సంతోషిణి.

జైశ్రీరామ్.

చంపకమాల గర్భ సీసము
అగణిత భవ్యదేహ శుభదైక మహేశ్వ -  రు, శ్రీగణేశ్వరున్! సుశ్రవణుని,
జగమునునిల్పు మా జనని సన్నుత వాణి - ని, శ్రీరమాసతిన్, నిరుపమ సతిఁ,
బ్రగణిత రాఘవున్, పరమ పావన సత్క - వి వ్రాతమున్, లసత్ విశ్వ జనుల,
జగతికి వెల్గులౌ సకల సద్గుణ పాళి -  ని, బ్రీతిఁ గొల్చెదన్, నేర్పు మీర
గీ. బంధ గర్భ చిత్రాది సద్బంధురముఁగ - శతకమును వ్రాయఁ నీపైన శక్తి నొసఁగ..
భక్త జన పోష! దుశ్శోష! పాపనాశ! - సూనృతోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ.. .

                     జైహింద్.

Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎన్నిసార్లు వెళ్ళినా ఇంత విపులంగా దేవాలయంలోని విశేషములను పరికించలేము .సుప్రభాతంతో మొదలైన శ్రీనృసిం హ స్వాము సేవలను చక్కగా దర్శింప జేసి నందులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.