గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీరామనవమి వ్రత విధానము

జైశ్రీరామ్.
శ్రీరామనవమి వ్రత పూజాప్రారంభః
ధ్యానం:
శ్లో || కోమలాంగం విశాలాక్షం ఇంద్ర నేల సమప్రభం, దక్షిణాంగే దశరధం పుత్రాపేక్ష ణత త్పరం,
వృష్టంతో లక్ష్మణందేవం సచ్ఛత్రం కనక ప్రభం, పార్మ్యే భరత శత్రఘ్నె తాళ వృతక రావుభౌ,
అగ్రేవ్యగ్రం హనుమంతం రామానుగ్రహ కాంక్షిణం. ఓం శ్రీ రామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి
ఆవాహనం:
శ్లో || విశ్వేశం జానకీ వల్లభ ప్రభుం కౌసల్యా తనయం విష్ణుం శ్రీరామంప్రకృతే: పరం ||
సహస్ర శీర్షే త్యావాహనం, శ్రీరామాగచ్ఛ భగవన్ర ఘువీరన్న పోత్తమ ||
జానక్యా సహరాజేంద్రా సుస్థిర భవ సర్వదా రామభద్ర మహేష్వాస రావణాంతక రాఘవ
యావతన్నాజాం సమాప్యే హంతాత్సన్ని హితోభవ || రఘునాయక రాజర్షి నమోరాజీవ లోచన,
రఘునంద నమోదేవ శ్రీరామాభి మభోభవ || ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి.
ఆసనం:
శ్లో || రాజాధ రాజ రాజేంద్ర రామచంద్ర మహీపతే రత్న సింహాసనం తుభ్యం దాస్యామి స్వీకురు ప్రభో || పురుషయే వేద మిత్యాసనం || ఓం శ్రీ రామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.
అర్ఘ్యం:
శ్లో || పరిపూర్ణ పరానంద నమోర మాయవేధనే, గృహాణర్ఘ్యం మయాదత్తం కృష్ణ విష్ణోజనార్దన, త్రిపాదే త్యర్ఘ్యం.
ఓం శ్రీ రామచంద్రాయ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి.
పాద్యం :
శ్లో || త్రైలోక్యపావనానంత నమస్తే రఘు నాయక, పాద్యం గృహాణరాజర్షే నమోరాజీవ లోచన ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః పాద్యం సమర్పయామి.
ఆచమనీయం:
శ్లో || నమస్సత్యాయ శుద్దాయ నిత్యాయ జ్ఞానరూపిణే, గృహాణాచమనంనాధ సర్వలోకైక నాయక, తస్మాద్విరా ఒచ్యాచ మనం,
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం :
శ్లో || నమశ్శ్రీ వాసుదేవాయ తత్వ జ్ఞాన స్వరూపిణే, మధుపర్కం గృహాణే దం జానకీ పతయే నమః
ఓం శ్రీ రామచంద్రాయ నమః మధుపర్కం సమర్పయామి
పంచామృత స్నానం :
శ్లో || పంచామృత మయానీతం పయోదది ఘ్రుతం మధు శర్క రాజల సంయుక్తం శ్రీ రామః ప్రతి గృహ్యాతాం .
ఓం శ్రీ రామచంద్రాయ నమః పంచామృత స్నానం సమర్పయామి
శుద్దోదక స్నానం :
శ్లో || ఆపోహిష్టామ యోభువః స్థాన ఊర్జే దధాతన| మహేరణాయ చక్షసే| యోవశ్శివతమొరసః||
తస్యభాజయతెహనః వుశాతీరివ మాతరః| తస్మాదరంగమామవో యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
ఓం శ్రీ రామచంద్రాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి .
వస్త్ర యుగ్మం :
శ్లో: స్వర్ణాంచలం స్వర్ణ విచిత్ర శోభితం| కౌశేయ యుగ్మం పరికల్పితంమయా||
ఓం శ్రీ రామచంద్రాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం :
శ్లో || బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మ సూత్రకం| గృహాణ భగవాన్ విష్ణో సర్వేష్ట ఫలదోభవ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఉపవీతం సమర్పయామి
గంధం :
శ్లో || శ్రీ ఖండం చందనం దివ్యం గందాడ్యం సుమనోహరం| విలేపన సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం||
ఓం శ్రీ రామచంద్రాయ నమః గంధాన్ సమర్పయామి
ఆభరణం :
శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే | భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఆభరణాన్ సమర్పయామి
పుష్ప సమర్పణ :
శ్లో || చామంతి కావకుల చంపక పాటలా| పున్నాగ జాజి రసాల మల్లికై| బిల్వ ప్రవాళ తులసీదళ పుష్పా త్వాం పూజయామి జగదీశ్వర|| ఓం శ్రీ రామచంద్రాయ నమః పుష్పాణి సమర్పయామి.
అధాంగ పూజ
శ్రీ రామ చంద్రాయ - పాదౌ పూజయామి
రాజీవ లోచనాయ - గుల్భౌ పూజయామి
రావణాంత కాయ - జానునీ పూజయామి
వాచస్సతయే - ఊరూ పూజయామి
విశ్వరూపాయ - జంఘే పూజయామి
లక్ష్మణాగ్ర జాయ - కటిం పూజయామి
విశ్వమూర్తయే - మేడ్రం పూజయామి
విశ్వామిత్ర ప్రియామి - నాభి పూజయామి
పరమాత్మనే - హృదయం పూజయామి
శ్రీకంటాయ - కంటం పూజయామి
సర్వాస్త్రదారిణే - బాహూ పూజయామి
రఘుద్యహాయ - ముఖం పూజయామి
పద్మనాభాయ - జిహ్వం పూజయామి
దామోద రాయ - దన్తాం పూజయామి
శ్రీరామ అష్ట్తోత్తర శతనామావళి
ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకివల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతయ నమః
ఓం శరనత్రాణ తత్సరాయ నమః
ఓం వాలిప్రమదనాయ నమః
ఓం వంగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వసినే నమః
ఓం విరాధవధపందితాయ నమః
ఓం విభి ష ణపరిత్రాణాయ నమః
ఓం హరకోదండ ఖండ నాయ నమః
ఓం సప్తతాళ ప్రభేత్యై నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాధర్పదళనాయ నమః
ఓం తాతకాంతకాయ నమః
ఓం వేదాంత సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగాస్యభే షజాయ నమః
ఓం త్రిమూర్త యే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండ కారణ్యవర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృ భక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేoద్రి యాయ నమః
ఓం జితక్రోథాయ నమః
ఓం జిత మిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం వృక్షవానరసంఘాతే నమః
ఓం చిత్రకుటసమాశ్రయే నమః
ఓం జయంత త్రాణవర దాయ నమః
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
ఓం సర్వదేవాద్ దేవాయ నమః
ఓం మృత వానరజీవనాయ నమః
ఓం మాయామారీ చహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదే వస్తుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహొదరాయ నమః
ఓం సుగ్రీవే ప్సిత రాజ్యదాయ నమః
ఓం సర్వ పుణ్యాదేక ఫలినే నమః
ఓం స్మ్రుత స్సర్వోఘనాశనాయ నమః
ఓం ఆది పురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహా పురుషాయ నమః
ఓం పుణ్యోద యాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్త్రాయ నమః
ఓం అమిత భాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంత గుణ గంభీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్త మాయ నమః
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాది పూ జితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశియే నమః
ఓం సర్వ తీర్ద మయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుంద రాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీత వాసనే నమః
ఓం ధనుర్ధ రాయ నమః
ఓం సర్వయజ్ఞాధీపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణ వర్ణ తాయ నమః
ఓం విభేషణప్రతిష్టాత్రే నమః
ఓం సర్వావగునవర్ణ తాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచిదానందాయ నమః
ఓం పరస్మైజ్యోతి షే నమః
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్సరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదే వత్మకాయ నమః
ఓం పరస్మై నమః
శ్రీ రామాష్టోత్తర శత నామావళి సమాప్తమ్
ధూపం :
శ్లో || వనస్పతి రసోద్భూతో గంధాద్యో గంద ముత్తమ రామచంద్ర మహీపాల ధూపోయం ప్రతిగ్నహ్యతాం యత్పురుష మితి ధూపం. ఓం శ్రీ రామచంద్రాయ నమః ధూప మాఘ్రాపయామి.
దీపం :
శ్లో || జ్యోతిషాం పతయే తుభ్యం నమోరామాయ వేధసే, గృహానదీ పకం చైవ త్రైలోక్య తిమిరాపహం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి
నైవేద్యం :
శ్లో || ఇదంది వ్యాన్న మమ్రతంర సైషజ్భి స్సమన్వితం, రాచ మంద్రేశ నైవేద్యం సీతాశ ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః నైవేద్యం సమర్పయామి
తాంబూలం :
శ్లో || నాగవల్లీ దళైర్యక్తం పూగీ ఫల సమన్వితం, తాంబూలం గృహ్యతాంరామ కర్పూరాది సమన్వితం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః తాంబూలం సమర్పయామి
నీరాజనం :
శ్లో: నృత్త్యైర్గి తైశ్చవా ద్యైశ్చ పురాణపట నాదిభి: రాజో పచారైరభి లైస్సంతుష్టోభవ రాఘవ ||
మంగళార్దం మహీపాల నీరాజన మిదంహరే ; సంగ్రహాణ జగన్నాధ రామచంద్ర నమోస్తుతే కర్పూర నీరాజనం ||
మంత్ర పుష్పం :
శ్లో || సర్వలోక శరణ్యాయ రామ చంద్రాయ వేదసే, బ్రహ్మనందైక రూపాయ సీతాయ|| పతయే నమః యజ్ఞే నేతి పుష్పాంజలి: ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయ
నమస్కార :
శ్లో: నమోదేవాది దేవాయ రఘునాధాయ, చిన్మయానంద రూపాయ నీతాయః పతయే నమః సప్తా స్యాసన్నితిన మస్కారః
పూజాఫల సమర్పణమ్:
శ్లో || యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు, యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర, యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు.
వ్రత కధా ప్రారంభము
1. శివ భక్తుడైన అగస్త్యమ హర్ష సుతేష్ణ మహర్షితో ఇట్లు పలికెను. ఓ ' సుతేష్ణ మునీ ' నీకు నేను ఒక రహస్యము చెప్పెదను.అని ఈవిధముగా చెప్పుట మొదలు పెట్టెను.
2. చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశో పచారములచే ఆరాధించి పురాణమును పటించి (చదివి) జాగారణముచేసి (నిద్ర మేల్కొని) మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పెద్ద వారిని, బంధువులను తృప్తి పరిచి, గోవు. భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యా పుత్రుడైన (కొడుకైన) శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను. ఇలా శ్రీ రామ నవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపముల అన్ని నశించును. ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరలొ కములందు భోగమును, మోక్షమును కలిగించునది. కావున మహాపాపిఐన నూ శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్ని జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభి రాముడగు శ్రీరామునివలె అన్ని లోకములలోను ఉత్తముడై వెలుగును.
3. శ్రీ రామనవమి వ్రతము రోజున తినెడి నరాధమునకు నరకము కలుగును. అన్నిటి కంటే ఉత్తమమైన ఈవ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలముకాదు. కావున ఈ వ్రతము ఒక సారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియూ తొలగి కృతార్దులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమ ( బొమ్మ) కు పూజ పూజా విధనాము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. ఈతని పలుకులు విని సుతేక్షుణుడు ఇలా అడుగు చుండెను. ఓ లోపాముద్రావతీ! ఎప్పుడూ ధనములేని వారైన మానవులకు సులభమైన ఉపాయము చెప్పుమనగా ఆగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు.
4. ఓ సుతేక్షణా! దరిద్రుడు అగు మానవుడు తనకు కలిగియున్న వరకూ స్వర్ణ రజతాదులలో (అనగా బంగారం) దెనిచే నైననూ పైసలలో పము చేయక శ్రీరాముని ప్రతిమను చేయించి ఈవ్రతం చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వపాపములు తొలగి పోవును. కావున ఎలాగైన ఈ వ్రతమును చేసి జానకీ కాంతుని పూజింపవలయును. ఈ వ్రతమును భక్తి కొలది చేయనివాడు రౌర వాది నరకములో పడును. అనిన విని సుతేక్షుడు ఓ అగస్త్య మహర్షి! శ్రీ రామమూల మంత్ర ప్రభావము నాకు తెలుపవలెను. అనిన అగస్త్యుడు వివరించుచున్నాడు. సమస్తములైన రామ మంత్ర ములలోను, ' రామ షడక్షరి అను మంత్ర రాజము ఉత్త మమని స్కాంద పురాణము. మోక్ష ఖండనము లోని రుద్ర గీత యందు శ్రీరాముని గూర్చి రుద్రుడు(శివుడు) చెప్పుచున్నాడు.
5. ఓ రామ! మణి కర్ణిక ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణమున ( అంటె కుడి చెవియందు) ' శ్రీ రామరామారామ' అను తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక పర బ్రహ్మము ' అని పిలువబడుచున్నావు. కావున పరిశుద్దము పాపనాశనము యైన శ్రీరామ నవమీ వ్రతము శ్రద్ధా భక్తి గల మానవులకు చెప్ప తగినది. ఇంతే కాక బంగారు, వెండి, రాగి మొ|| న లోహములలో దేనితో నైననూ శ్రీరామ ప్రతిమను చేయించి అందు దేవుని ఆవాహనము చేసి, ఇంతకు ముందు చెప్పిన విధముగ పూజ చేసి, ఆ ప్రతిమ(బొమ్మ) దగ్గర శ్రీరామనవమి రోజున ఏకాగ్ర చిత్తుడై (అంటే మనస్సును దేవుని యందే నిలిపిన వాడై) జపము చేయుచునుండి, మరునాడు పునః పూజ చేసి (అంటే మరల పూజించి) సంపూర్ణ భోజనము దక్షిణ దానములచే బ్రాహ్మణులను సంతోషింప చేయుటచే లోకాభి రాముడైన శ్రీరాముడు అనుగ్ర హించును. (సంతోషించును) కావున మనుజుడు ధన్యుడు అగును. ఈ విధముగ పన్నెండు, సంవత్సరములు చేయుటచే సర్వపాపకర్మలు నశించిన వాడగును.
6. రామమంత్రము తెలియనివాడు ఈ వ్రతము రోజున ఉపవాసము ఉండి (అంటే భోజనము ఇంకా ఆహార పదార్దములు ఏమియు తీసుకొనక) శ్రీరామ స్మరణ చేసిన చో అన్ని పాపములు పోయిన వాడగును. మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్న వాడై ప్రతి గంట నిశ్చల మైన మనసు కలవాడై, మోక్షమును కోరినవాడై పుజించువాడు సర్వదోషములచే విడువబడి నాశనములేని శ్రీరామ తారక పర బ్రహ్మమును పొందునని ' అగస్త్య మహర్షి వివరించెను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీరామ నవమి వ్రతము చేయక పోయినా మీ రందించిన వ్రత విధానమును చదివి వ్రతముచేసిన ఫలితము దక్కినంత ఆనందము కలిగినది ధన్య వాదములు




కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.