గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, జులై 2015, ఆదివారం

గో భూ తిల హిరణ్యాజ్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. గో భూ తిల హిరణ్యాజ్య వాసౌ ధాన్య గుడానిచ 
రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః.
ఆ.వె. గోవు, భూమి, తిలలు,కుందన మాజ్యము,
వలువ, ధాన్య, గుడ, లవణ, రజతము
లిలనివి దశ దానములనుచు ద్విజులకు
దానమిచ్చుచుంద్రు ధర్మపరులు. 
భావము. దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి,వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు.అనునవి దశ దానములు. ఇవి యోగ్యులగు బ్రాహ్మణులకు దానమిచ్చుట సత్ఫలదాయకము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
దశ దానములను తెలియ జెప్పినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.