గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2015, శనివారం

పిప్పలాదసముత్పన్నే ... శ్రీ జి.భాస్కరరామ్.

జైశ్రీరామ్.
మూలము: శ్రీవేదవ్యాసోక్త మహాభారతము
పరిష్కర్త: శ్రీ కమలాకరభట్టు (నిర్ణయసింధు)
తద్విధిశ్చతత్రైవ -
పిప్పలాదసముత్పన్నే కృత్యేలోకభయంకరీ
పాషాణస్తే మయాదత్తం ఆహారార్థే ప్రకల్ప్యతాం||
 
ఇతి పాషాణమ్ ప్రక్షిప్య
విశ్వాచీచ ఘృతాచీచ విశ్వయోనే విశాంపతే
సాన్నిధ్యం కురుమేదేవ సాగరే లవణామ్భసి ||
నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణో అపామ్పతే
నమో జలధిరూపాయనదీనాంపతయే నమః ||
సమస్త జగదాధార శంఖచాక్రగదాధర
దేవా దేహిమమానుజ్ఞాం తవతీర్థ నిషేవణే||
త్రితత్వాత్మకమీశానం నమో విష్ణుముమామ్పతిం
సాన్నిధ్యం కురుమేదేవ సాగరే లవణామ్భసి ||
అగ్నిశ్చ యో నిర్మలశ్చ దేహోరేతోధా విష్ణురమృతసననాభిః
ఏతద్ బృవన్ పాండవ సత్యవాక్యం తతోऽవగాహేతపతిం నదీనామ్
భావము: 
పిప్పలాదునిచే ఉత్పన్నమైన లోకభయంకరమైన ఓ కృత్యా! నేను ఈ "రాయి" ని నీకిస్తున్నాను. దీనిని ఆహారముగా వినియోగించుకో అని పాషాణం సముద్రంలోకి వేసి,
"విశ్వాచీ, ఘృతాచీ, విశ్వయోని, విశాంపతి, ఓ దేవా!. ఉప్పునీరు గల ఈ సముద్రములో నాకు నీ సన్నిధిని ప్రసాదించు. విశ్వాన్ని రక్షించే నీటికి అధిపతివైన విష్ణూ నీకు నమస్కారము. జలస్వరూపుడవైన, నదులకు పతివైన నీకు నమస్కారము. సమస్త జగత్తుకు ఆధారమైన శంఖచాక్రములను ధరించిన ఓ దేవా! నీ తీర్థాన్ని సేవించడానికి నాకు అనుజ్ఞనివ్వు. త్రితత్వాత్మకుడు, ప్రభువు అయిన ఉమాపతికి, విష్ణువునకు నమస్కారము. ఓ దేవేశా! ఉప్పునీరు గల ఈ సముద్రములో నాకు నీ సన్నిధిని ప్రసాదించు. అగ్నిస్వరూప, సర్వకారణ, వాయురూప, దేహంలో రేతస్సును పోషించేవాడా, అమృతకేంద్రమైన ఓ విష్ణూ అని సత్యవాక్యం పలుకుతూ (ఓ పాండవా!) ఈ సముద్రములో మునగాలి (స్నానం చెయ్యాలి)
ఇక్కడ నది, పుష్కరము,  అనే మాటల ప్రస్తావనే ఇక్కడ అసలు కనబడదు.. "పాషాణం అనగా రాయి" అంతే గానీ మన్ను కాదు. 
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.