గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జులై 2015, సోమవారం

భారతదేశ ౧౧వ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం మనకిక లేరు.

ఓం నమశ్శివాయ.
పరమ పవిత్రమైన తొలి ఏకాదశి అయిన నేడు 84 ఏండ్ల మన మాజీ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం దివంగతులైన వార్త దిగ్భ్రాంతి కలుగజేసింది.
భారత దేశ మాజీ రాష్ట్రపతి భారత రత్న బిరుదాంకితుడు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం నేటి సాయంత్రం సుమారు ఆరుగంటల నలభై నిమిషములకు స్వర్గస్తులైనారు.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐయంలో జరుగుచున్న సెమినార్లో ప్రసంగిస్తూ కుప్పకూలారు. తదుపరి సమీపంలోగల బెథనీ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటూ అసువులు బాశారు.
ప్రపంచంలోనే ఒక అగ్రగణ్యుడైన అంతరిక్ష రక్షణ శాస్త్రవేత్త 
శ్రీ ఏపీజే అబ్దుల్ కలాంఅకాల మరణం మనందరికీ తీరని లోటు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకొంటున్నాను.
ఓం నమశ్శివాయ.


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖులు శ్రీ అబ్దుల్ కలాం గారి ఆత్మకు శాంతి చేకూరాలని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.