గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, ఫిబ్రవరి 2015, ఆదివారం

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. వారు వృద్ధాశ్రమాల పాలా? అవ్వ్వ్వ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మాతృదేవోభవ, పితృ దేవోభవ, అని మన సంస్కృతి మనకు తెలియజేస్తోంది. అటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమాభిమానాలతో పెంచాలి.అలాగే తమను కని, పెంచి, పెద్దచేసి యోగక్షేమాలనుకోరుకొనే తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలు అత్యంత ప్రేమాభిమానాలతో మెలగాలి. వారి మనసు తెలుసుకొని మెలగాలి. వారు పెద్దవారు.వారి ప్రవర్తన  కొంచెం చాదస్తంగా పిల్లలకు అనిపించ వచ్చును. అంతలోనే వారిని విసుగుకోవడం కసురుకోవడం లాంటి పనులు చేసి పాపం మూటకట్టుకో కూడదు. కడుపున పుట్టిన బిడ్డలను ఎలా ప్రేమగా చూస్తూ, వారేదైనా పొరపాటు పని చేసినా దానిని తేలికగా తీసుకొని ఎలా ప్రేమగా చూస్తామో అలాగే త్ల్లిదండ్రుల విషయంలో కూడా ఉండాలి. అది ధర్మం.

తల్లియు తండ్రియున్ గురుడు దైవములంచు పఠించినారలే!
చల్లని వారి ప్రేమగొని, చక్కగ పెద్దగ మారినారలే!
మల్లెలవంటి వారినిల మంచిగ చూచి రహించుటొప్పదే!
పిల్లల బాధ్యతల్ మరచి వృద్ధుల వాసములందు చేర్తురే!
మీరూ పిల్లలో, తల్లిదండ్రులో అయి ఉంటారు కదా! మరి మీరూ ప్రతీదీ అనుభవించవలసినదే కదా? మీ ధర్మం మీరు నెరవేర్చండి. మీ పిల్లలు కూడా ధర్మబద్ధులై ప్రవర్తించేలా చేయండి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా మంచి అంసాన్ని చూపించారు .చాలామంది విషయంలో జరుగుతున్నది ఇదే. కొందరు ఇంకా ఘోరం భార్య దగ్గర తనమంచితనం ఘనత పోకూడదు .పైగా ఈమధ్య విపరీతంగా పెరిగిన విషయం" ఏదైనా అంటే తనని వదిలేస్తుందేమో అన్న భయం .అందుకని మొగపిల్లలు బానిసలుగా బ్రతుకు తున్నారు . ఈ దేశాల్లో మరీ విపరీతం. బొత్తిగా బానిసత్వం. ఇక్కడ చూసి అక్కడ వాత పెట్టుకుంటున్నారు అంతే .ముందు తరానికైనా మారుతుందని ఆశిద్దాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.