గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఫిబ్రవరి 2015, శనివారం

మాయింటికి సతీ సమేతముగా విచ్చేసి మాకు ఆనందం కలిగించిన శ్రీమద్భాగవత గణనాధ్యాయి శ్రీ ఊలపల్లి సాంబశివరావు గారు.

 జై శ్రీరామ్.
ఆర్యులారా! నిన్నటి రోజు ఎంతో ఆనందాన్ని కలిగించిన రోజు. శ్రీమద్భాగవత గణనాధ్యాయి శ్రీమాన్ ఊలపల్లి. సాంబశివ రావు గారు మా కోరిక మేరకు సతీ సమేతముగా మాయింటికి వచ్చి వారి భాగవత గణనాధ్యయనవిధానము సర్వము వివరించి మాకెంతో ఆనందం కలిగించారు. మరొక్క రెండు రోజులలో వారు హస్తినాపురమునకు వారి నివాసము శాశ్వితముగా మార్చివేయుచున్న సందర్భముగా గౌరవ పురస్సరముగా వారు వచ్చారు.
వారు వచ్చుచున్న వార్తకు సంతసించి, వారికి వీడ్కోలు చెప్పు నిమిత్తము శ్రీయుతులు గుత్తి(జోళదరాశి)చంద్రశేఖరరెడ్డి, అన్నపురెడ్డి సత్యనారాయణరెడ్డి, రామ మోహన్ లు కూడా మాయింటికి  వచ్చారు. వీరందరితోను మాయిల్లు ఒక భాగవత మందిరాన్ని తలపించింది. ఆ పరమాత్మ కృప మాపై యీ విధంగా పడినందుకు నేను, నా కుటుంబ సభ్యులు ఎంతగానో ఆనందం పొందాము. 
దైవము పంపకున్న సుగతిన్ బొడగొల్పెడి జ్ఞాన మూర్తు లీ
జీవికి సంతసంబునిడ చేరగ వచ్చుట సాధ్యమౌనె? నా
భావన దైవదత్తమయి భాగవతోత్తము సాంబమూర్తినే
జీవము గొల్ప జేర్చె గుణ శేఖర సంహతి తోడ నేడహో!
నాపై ప్రేమామృతాన్ని ప్రసరిమ్పజేసిన వీరందరికీ నా ధన్యవాదములు తెలుపుకొంటున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

vsrao5- చెప్పారు...

ధన్యవాద సమేత ప్రణామములు పండితవరేణ్యులకు. . . .

sreeram chaturvedula చెప్పారు...

dayachesi vari nutana chirunama tellpagalara? vari cell phone number to saha.
varini darsinchukundamani undi
bhavadeeyudu
sreeram murthy chaturvedula

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.