గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఫిబ్రవరి 2015, బుధవారం

14-03-2015 మరియు 15-03-2015 తేదీలలో శ్రీమదాంధ్ర పద్య కవితా రాష్ట్ర స్థాయి సదస్సు వార్షికోత్సవం.

జై శ్రీరామ్.
ఆర్యులారా! మీకందరికీ ఒక శుభ వార్త.
విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి లో శ్రీమదాంధ్ర పద్య కవితా రాష్ట్ర సదస్సు వార్షికోత్సవం 
14-03-2015 మరియు 15-03-2015 తేదీలలో జరుప బడుచున్నది.
ఆంధ్రులై యున్న ప్రతీవారికీ ఈ వార్త ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. 
సుప్రసిద్ధులైన మహాకవిపండితుల మేలి కలయికతో, అద్భుతమైన అవధానాలతో, భువన విజయాది సాహితీ కార్యక్రమములతో ఈ సదస్సు రెండు రూజులూ  హృదయోల్లసజనకంగా జరుగుతుంది. 
ఈ సభకు సహృదయులందరూ ఆహ్వానితులే.
సభకు ఉత్సాహంతో హాజరవదలచుకొన్నవారు ముందుగా తమ వివరాలను ఆంధ్రామృతం ద్వారా తెలియజేస్తే మీకు ఆహ్వానాలు పంపబడతాయి.
ముఖ్యంగా మీ చిఱునామా, మీ చరవాణి సంఖ్య (సెల్ నెంబరు) మీ అంతర్జాల చిఱునామా (మీ ఈమెయిలైడీ) మీరు అనకాపల్లి చేరే సమయం మున్నగు వివరాలు తెలియజేస్తే 
మీరు అనకాపల్లి చేరేసరికి అక్కడ తగు వసతి, అల్పాహార, భోజనాది సదుపాయములు ఏర్పాటు చేయబడతాయి.
విశాఖపట్టణం జిల్లా పద్యకవితా సదస్సు అధ్యక్షులు శ్రీ కొట్టే కోటా రావు గారితో 
9440977810 అనే  cell number కి phone చేసి మాటాడి మీరు మీ వివరాలను స్వయంగా తెలియ జేయ వచ్చును. 
కార్యక్రమ వివరాలతోఆహ్వాల పత్రం సిద్ధం కాగానే అంధ్రామృతంలో ప్రచురించ గలను. ఆంధ్ర భాషాభిమానులైన వారు, ఆంధ్ర కవులుగా వెలుగొంద దలచువారు, ఎక్కడ ఉన్నా ఈ సభకు హాజరయి, నిర్వాహకులను కృతార్థులను చేయగలరు. ఆంధ్ర భారతిని మీ భక్తి పద్య కుసుమాలతో ఆరాధించ గలరు. 
మీ స్పందనకై నేను ఎదురు చూడ వచ్చునా? నా sell number 9247238537.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.