గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2015, శనివారం

ఆంధ్రామృత పానశోభితులకు మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! ప్రపంచం అంతటా అన్ని భాషలవారు నేడు మాతృభాషా దినోత్సవముగా జరుపుకొనుచుండుట ముదావహం. ఆంధ్ర మాత ముద్దు బిడ్డలమైన మనము మన భాషా సరస్వతికి హారతులు పట్టి భాషామతల్లిపై మనకు గల ప్రేమను చూపుకొని, మన అస్తిత్వమును చాటుకొన వలసిన అవసరమెంతైనా ఉన్నది.
ఈ సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మనభాష మన సంస్కృతిని చాటుతుంది. మన భాష మన ఔన్నత్యానికి పతాక. మన భాషా సంస్కృతులు మన బిడ్డలకు భవిత. అట్టి మహత్తరమైన మన మాతృభాషను ఏ పరిస్థితిలోను అలక్ష్యమునకు గురి చేయరాదు. 
మనం మాతృభాషలో మాటాడుటకు సంశయించడమంటే మన అస్తిత్వాన్ని మనమే శంకిస్తున్నట్టు గుర్తించుకోవాలి.
తెలుగు భాషకన్న తేలికైనది లేదు.
తెలుగు వారు భువిని వెలుగువారు
తెలుగు పలుకుచుండి నిలుపను పెంచుడు.
తెలుగుతేనె గ్రోలి వెలుగుడయ్య.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును మనమాతృ భాషను మనం కించ పరిస్తే మన వ్యక్తిత్వాన్ని మనం చంపు కున్నట్టే .
మాతెనుగు తల్లికి మల్లెల మాలల శత వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.