గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, డిసెంబర్ 2014, మంగళవారం

మాతా సమం నాస్తి శరీర పోషణమ్, మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
श्लॊ. माता समं नास्ति शरीरपोषणम्,
चिन्तासमं नास्ति शरीरशोषणम्, !
भार्या समं नास्ति शरीर तोषम्,
विद्यां सममं नास्ति शरीरभूषणम् !!
శ్లో. మాతా సమం నాస్తి శరీర పోషణమ్,
చింతా సమ్నం నాస్తి శరీర శోషణమ్.
భార్యా సమం నాస్తి శరీర తోషణమ్.
విద్యా సాం నాస్తి శరీర భూషణమ్.
గీ. మనలఁ బోషించి కాచును మాతృమూర్తి.
పాయనిది చింత, శుష్కింపఁ జేయు మనల.
భార్య సంతోషదాయిని. భాగ్య రాశి.
విద్య భూషణంబయినిల్చు వేల్పు మనకు.
భావము. మన శరీరమును పోషించుటలో తల్లికన్న గొప్పవారు ఉండరు. మనలను శుష్కింప జేయుటలో చింత కంటే మించినది వేరు లేదు. మన శరీరమునకు ఆనందము కలిగించుటలో భార్యను మించినవారుండరు.
మన శరీరమునకు విద్యకు మించిన అలమ్కారము లేదు.
జైహింద్.

Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా చక్కని విషయాలు చెపారు
ధన్య వాదములు
అవధానములు చాలా బాగా జరినట్లు చూసాను అన్నిటా మీరు భాగస్వాము లైనందుకు చాలా ఆనందము గాఉంది అక్కడ ఉండి ఉంటే నేను తప్పక వచ్చి ఉండేదాన్ని నాగఫణి శర్మ గారి అవధానంలో పాల్గొనడం చాలా అదృష్టం . నేను ఇదివరకు పాల్గొన్నాను

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అక్కయ్యా! నమస్తే. మీరు ఇతః పూర్వమే మాడుగులవారి అవధానంలో పాల్గొన్నందుకు చాలా ఆనందం. మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. సారస్వత భిక్ష.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.