గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2014, మంగళవారం

నేడు గీతా జయంతి సందర్భంగా ఆ పరమాత్మ సద్బోధ మానవాళికి శుభాల్ని చేకూర్చాలని మనసారా కోరుకొంటున్నాను.

జైశ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఆర్యులారా!  నేడు గీతా జయంతి సందర్భంగా మీ యెడ కృష్ణ పరమాత్మ ప్రసన్నుఁడు కావాలని, ఆ గీరామృత పాన లోలురై మీరు శుభ పరంపరలకు ఆలవాలం కావాలని మనసారా కోరుకొంటున్నాను. 
మీ అందరికీ  గీతా జయంతి శుభాకాంక్షలు.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః| 
పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్|| 
గీ. ఉపనిషత్తులనావుగా నొనరఁ జేసి,
అర్జునునిదూడగాచేసి,ఆవుపాలు
త్రాగవిడిచి గోపాలుండు త్రాగనొసగె
లోకమున గీతగా చేసి లోకులకును. 
భావము. సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను అంటే ఉపనిషత్ సారమైన గీతను అందిచినాడు.
ఆ.వె. రోజుకొక్క శ్లోక రాజంబు నేర్చిన -  బీజమగుచు మదిని వెలయు గీత
కల్పవృక్షమగుచు  కాపాడు మిమ్ములన్ - నిల్పుడిద్ది మదిని నిత్య మెఱుఁగ.
క. ఒక్కొక్కధ్యాయంబును
చక్కగ నిరువది దినములు సద్గతి నేర్వన్
నిక్కము పదునెనిమిదియును
మక్కువతో వత్సరమున మదిలో నిలుచున్.
ఆ.వె. గీత నేర్తువేని వ్రాత మార్తువు నీవు.
గీత మార్చు నుదుటి వ్రాత మనకు.
నేర్చుకొనుము గీత నేర్పుమితరులకు.
జన్మ ధన్యమగును సదయ హృదయ!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.