గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, డిసెంబర్ 2014, శుక్రవారం

సరళమైన తెలుగు పద్యములలో అగ్ని సూక్తము.

జైశ్రీరామ్.

సరళమైన తెలుగు పద్యములలో అగ్ని సూక్తము.

౧.ఆ. అగ్నినిపురహితునియజ్ఞప్రకాశకు,  -  నసమ ఋత్విజుని విలసిత హోత
నఖిల ధర్మ జ్ఞాన మమరించి పోషించు  -  యనిలసఖునిగొలుతు ననుపమగతి.

౨.ఆ. అగ్నిపూర్వ ఋషులు నంతియె కాక యా  -  ధునిక ఋషుల చేత వినుతయోగ్యు
డట్టి యగ్ని యిచట నమర శక్తులనెల్ల  -  నమరఁజేయ వలతు యజ్ఞమునకు.

౩.గీ. దినదినంబున పుష్టినందించి వృద్ధి  -  నందఁజేయు విక్రాంతుల కధిక కీర్తి
కలుఁగ చేయు యశోధనములను బడయు  -  నగ్ని మూలాన సాధకుఁ డసదృశముగ .

౪.గీ. జయమునపజయంబను భావచయము మీరి,  -  సాధనా యజ్ఞ మార్గ సద్బోధ కలిగి
అన్నివైపులనుందువీ వప్రమత్త -  తను నదియె యజ్ఞమనిమెత్తు రనిమిషులును.

౫.గీ. తలచి జ్ఞానద దేవాళిఁ బిలుచువాఁడు  -  విసృజనోపజ్ఞసాధనన్వెలుగు క్రియలు
చేయువాఁడునుమార్పులే చేరనతఁడు.  -  కనులకు  విచిత్ర కాంతిని కలుగఁజేసి,
చెవులకు విచిత్ర నాద సచ్ఛ్రీ స్వశక్తి  -  కలుగఁ జేసెడి వాడునుఘనతరమగు
వివిధ సచ్చిత్రధ్వని చిత్ర నివహమనగ  -  పేరుఁ గన్నట్టి వాఁడగ్నిదేవుఁడిపుడు
తనకు సాటైన దేవతాతతులతోడ  -  వచ్చుగాత నా కడకు తా మెచ్చుగాను.

౬.గీ. చూడుమగ్నియంగిరుఁడావసుంధరపయి 
తాను చేసెడి కర్మలఁ దక్కు ఫలము
భగవదర్పణ చేసెడిభక్తులకిల  
నెట్టి కల్యాణములుగూర్తు వట్టివెల్ల
నీవి. నీకిది తగునయ్యనిజము నిజము.

౭.గీ. అగ్నిహోత్రుఁడరేబవలనితరమగు  -  సాధకులమైన మేము సద్బోధఁ జేసి
యోచనను చేయు కర్మలనొప్ప, వంద  -  నముల నింపుచు, నిన్ జేరుదుమయకనుమ!

౮.గీ. పృథుఫలాసక్తియన్ హింస విడుచునట్టి  -  యజ్ఞ దేదీప్యమార్గాలు ప్రజ్ఞఁ గాచు
వాఁడవునువిశ్వనియమమ్మువరలఁ జేయు  -  వాడవు, నిగృహీతమయినవరలునట్టి
క్రమ సుశిక్షణాయుతమైన తమదెయైన  -  సాధనశరీర గృహమున మోదమొప్ప
వరలు చున్నట్టివాఁడవు నిరుపమముగ,  -  వందనము సేతు కృపతోడనందుకొనుము.

౯.గీ. తండ్రివలె మమ్ము సులువుగా దరికిఁ జేర  -  నిమ్ముమేము భద్రమ్ముగా యిమ్ముతోడ
నుండ మాతోడ నీవిల నుండుమయ్య.  -  రామకృష్ణను మన్నించి ప్రేమఁ గనుము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.