జైశ్రీరామ్.
శ్లో. యది నాత్మని పుత్రేషు నచేత్పౌత్రేషు,నప్తృషునత్వేవ తు కృతోஉధర్మః కర్తుర్భవతి నిష్ఫలః.
గీ. కర్తయె యధర్మఫలభోక్త. కాని నాడు,
కొడుకులో, కాక మనుమలో కుడువ కుండ
సమసి పోవదధర్మము. సరళిఁ గనుఁడు.
ధర్మవైరుధ్య పాపిష్టి కర్మవిడుడు.
భావము. ఒకడు తాను చేసిన అధర్మఫలం తాను అనుభవించకపోతే, దానిని అతని కుమారుడో, అతని మనుమడో, మునిమనుమడో అనుభవించక తప్పదు. అధర్మఫలకర్తృత్వం ఎప్పటికీ సమసిపోయేదికాదు.
జైహింద్.