గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జూన్ 2014, శుక్రవారం

అదండ్యాన్ దండయన్ రాజా...మేలిమి బంగారం మన సంస్కృతి, 230.

జైశ్రీరామ్.
శ్లో. అదండ్యాన్ దండయన్ రాజా ,దండ్యాంశ్చైవాప్యదండయన్ 
అయశో మహదాప్నోతి నరకం చైవ గచ్ఛతి.
 
క. దోషిని శిక్షింపక ని 
ర్దోషిని శిక్షించుటరయ దోషాన్విత మీ
దోషము చేసిన నరకము. 
ధ్యాసఁ గలిగి మెలఁగుట మన ధర్మము. కనుడీ.
భావము. నిర్దోషులను దండించి,దండింప దగినవారిని దండింపని రాజు గొప్ప అపకీర్తిని పొందటమే కాక,నరకానికి పోతాడు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అటువంటి రాజు పరిపాలనకు అనర్హుడు .యధారాజా , తధా ప్రజా అన్నరు.సరియైన రాలు లేకపోతే ఆరాజ్యం కుడా సతిగాఉండదు .ఇవన్నీ ఏరుకో వలసిన మంచి ముత్యాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.