గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జూన్ 2014, శుక్రవారం

ఉగాది స్వరాలులో విజేత డా.ఆచార్య ఫణీంద్ర.

జైశ్రీరామ్.
ఆర్యులారా! అంతర్జాల మాస పత్రిక శిరా కదంబం జయ ఉగాది సందర్భంగా నిర్వహించిన ఉగాది స్వరాలు కవిసమ్మేళనంలోవిదిగ్గజ డా. ఆచార్య ఫణీంద్ర వ్రాసిన రెండు కోకిలలు ఉత్తమ కవితగా ఎంపిక చేయబడినట్లు ప్రకటించినారు. 
https://sites.google.com/site/siraakadambam/home/03017
ఈ సందర్భంగా డా. ఆచార్య ఫణీంద్ర గారిని మనసారా అభినందిస్తూ
ఈ ఉగాది స్వరాలలో పాలుపంచుకొన్నవారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. 
ముఖ్యంగా శిరాకదంబం మాస పత్రిక నిర్వాహకులైన శ్రీ శిష్ట్లా రామచంద్రరావు గారి అత్యద్భుతమైన ఆలోచనా సరళిని, అందుకు తగిన రూపకల్పనను, కవులను, పాఠకులను ప్రోత్సహిస్తున్న విధానమును ప్రశంసింపకుండా ఉండలేకపోతున్నాను. 
వారికి నా హృదయ పూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.
జైహింద్.
Print this post

4 comments:

అజ్ఞాత చెప్పారు...

ఆంధ్రులకి వ్యతిరేకంగా ప్రతి దినమూ రాత్రనక, పగలనక భయంకరమైన విషం, విద్వెషం కక్కిన ఈ తెలపాము సర్పాచారికి ఇలాంటి బహుమతులు ఇవ్వడం ఆంధ్రులకి చేవ చచ్చింది, వెన్నెముక లేదు అనడానికి మంచి ఉదాహరణ. వీడి బ్లాగు నిండా అబద్దాలూ, అర్ధ సత్యాలూ, విషం, విద్వెషం తప్ప వేరే ఏమి ఉండదు. దయ చేసి ఈ విష తెలబాన్ సర్పాలను పోషించకండి. తెలపాముకి పాలు పొయ్యొద్దు.

శ్రీరామ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! అజ్ఞాత గారూ! ఆంధ్రులుగా మీ ఆవేదనను అర్థం చేసుకొన్నాను. ఐతే ఇక్కడ విషయం కేవలం ఉగాది కవితా పురస్కారము మాత్రమే కావున నిర్వాహకులు ఈ రచనల కొఱకు కవులను ప్రోత్సహించగా న్యాయ నిర్ణేతలు పరిశీలించి, ఈ పురస్కారాన్ని ప్రకటించి యున్నారు. ఇది కేవలము న్యాయ నిర్ణేతల అభిప్రాయం మాత్రమే. యావదాంధ్ర జాతిదీ కాదు. ఈ పురస్కారానికి కేవలం కవుల కవితా గానం మాత్రమే పరికింపబడతాయి. మిగిలిన విషయాలు అప్రస్తుతమౌతాయి. విజేత యెవరైనా సరే అభినందించడం మన ఆంధ్రుల సాంప్రదాయం అని నా అభిప్రాయం.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆచార్య ఫణీంద్రగారు ఇలా తెలియజేస్తున్నారు.
DrAcharya Phaneendra

I am very very happy to inform all my well-wishers that I am invited by North America Telugu Association (NATA) to attend its 2nd convention to be conducted at Atlanta, U.S. during 4 July 2014 - 6 July 2014.
Thanks to Raghu Goverdhana, who not only forwarded my profile to NATA, but also encouraged me to go ahead in each stage till my Visa is approved today.
The list of invitees to the convention is given in the link given below.
http://www.nata2014.com/invitees.php
I will reach Atlanta on 1st July and stay upto 11th July.
I don't know who stays where in U.S., but I wish all my intimate relatives and friends meet me there, if possible.

NATA Convention 2014
NATA 2014 convention is bound to exceed expectations through rich literary & cultural events, political seminars, celebrity appearances, philosophical and religious seminars, sumptuous meals and much more.
NATA2014.COM
ఈ సందర్భంగా ఆచార్య ఫణీంద్రగారికి అభినందనలు.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారూ!
అంతర్జాలంలో మరేదో వెదుకుతుంటే .. అనుకోకుండా ఒక సంవత్సరం తరువాత ఈ రోజు మీ ఈ పోస్టును, దాని క్రింద ఒక అజ్ఞాత వ్రాసిన వ్యాఖ్యను చూసాను. ఔరా.. ! వాడు నా మీద ఎంత విషాన్ని విద్వేషాన్ని కక్కాడు! నావి అర్ధ సత్యాలో .. పూర్ణ అసత్యాలో .. నా బ్లాగులోనే వాదించి సత్య స్థాపన చేసే చేవ వాడిలో చచ్చిపోయింది పాపం! ఏమైనా ఆ పరమాత్ముడు వాడి కల్లోలితమైన ఆత్మకు శాంతిని ప్రసాదించు గాక!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.