గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జూన్ 2014, ఆదివారం

విదేశేషు ధనం విద్యా , మేలిమి బంగారం మన సంస్కృతి 209.

జైశ్రీరామ్.
శ్లో. విదేశేషు ధనం విద్యా , వ్యసనేషు ధనం మతి: 
పరలోకే ధనం ధర్మ: , శీలం సర్వత్ర వై ధనమ్.

క. పరదేశంబున విద్యయు, 
నిరుపమ వ్యసనమున బుద్ధి, నిత్యంబగునా
పర లోకమందు ధర్మము, 
వర శీలం బెల్ల యెడల వర ధనములగున్.
భావము. విదేశములో ఉన్నప్పుడు విద్యయే ధనము. కష్టకాలములో బుద్ధియే ధనము. పరలోకములో  ధర్మమే ధనము. అన్ని ప్రదేశములందును అన్ని సమయములందును శీలమే గొప్ప ధనము.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఎక్కడ ఉన్నా , ఎంత ధనమున్నా అన్నిటికన్నా మిన్న ఐన మంచి గుణం ప్రధానం కీర్తినిస్తుంది బాగుంది ధన్య వాదములు చక్కని సూక్తి

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఎక్కడ ఉన్నా , ఎంత ధనమున్నా అన్నిటికన్నా మిన్న ఐన మంచి గుణం ప్రధానం కీర్తినిస్తుంది బాగుంది ధన్య వాదములు చక్కని సూక్తి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.