గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జూన్ 2014, బుధవారం

భద్రం భద్రమితి బ్రూయాత్ ...మేలిమి బంగారం మన సంస్కృతి, 211.

జైశ్రీరామ్.
శ్లో. భద్రం భద్రమితి బ్రూయాత్, భద్రమిత్యేవ వా వదేత్
శుష్క వైరం, వివాదం చ న కుర్యాత్ కేనచిత్ సహ.
ఆ.వె. శుభము, శుభమటంచు శుభమునే పల్కుఁడు. 
శుభము పల్క నీకు శుభము కలుగు. 
శుష్క వైరములకు చూడబోవకుమయ్య. 
వ్యర్థ వాదనంబు వద్దు వద్దు.
భావము. ఎల్లప్పుడూ శుభం, శుభం అంటూనే ఉండాలి. శుభమగుగాక అనే పలుకుతూ ఉండాలి. ఎవరి తోనూ కూడా శుష్క విరోధాలూ, తగవులకు దారితీసే వితండ వాదాలు కూడదు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పైన తధాస్తు దేవత లుంటారట అందుకని ఎప్పుడూ శుభంలె పలకాలని అంటారు మంచి బంగారం లాంటి సూక్తి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.