గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2014, బుధవారం

దుర్జన: ప్రియవాదీతి నైతద్విశ్వాసకారణం. మేలిమి బంగారం మన సంస్కృతి185

జైశ్రీరామ్.
శ్లో. దుర్జన: ప్రియవాదీతి నైతద్విశ్వాసకారణం 
మధుతిష్ఠతి జిహ్వాగ్రే హృదయే తు హలాహలమ్.
గీ. తీపి మాటల ధూర్తుని తెలియుఁడయ్య

నమ్మి మోసపోవలదట్టి నరుని వలన.
మాటలందునె తీయన. మనసు విషము.
రామ కృష్ణుని మాటలు బ్రహ్మ వాక్కు.
భావము. తీయగా మాట్లాడు తున్నాడు కదా అని చెడ్డవాడిని ఎన్నడూ నమ్మకూడదు. వాని నాలుక చివర తేనె, మనస్సులో మాత్రం విషం ఉంటాయి.
 జైహింద్.

Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

నేడు 90% జనులు మీరు చెప్పిన విధముగా జీవించు చున్నారు.

మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదములు .

శిష్య పరమాణువు
వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును అలామాటాడే వారినే తేనె పూసిన కత్తులు అంటారు .ఎదురుగా పొగిడేవారిని అస్సలు నమ్మకూడదు అనేసామెత అందరికీ తెలిసినదే కదా చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.