గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఏప్రిల్ 2014, శుక్రవారం

మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః మేలిమి బంగారం మన సంస్కృతి180.

జైశ్రీరామ్.
శ్లో.జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్జితం 
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః
గీ. ధర్మ హీనుడు బ్రతికియు ధరణి మృతుఁడు.
ధర్మ బద్ధుఁడు మృతుఁడయ్య ధరణి జీవి.
ధర్మమును వీడ బోక యీ ధరణి పై
కీర్తి ప్రదముగ బ్రతుకుడు స్ఫూర్తి తోడ.
భావము. ధర్మాన్ని త్యజించిన వ్యక్తి జీవించి ఉన్నా , మృతునిగా పరిగణింపబడుతాడు. ధర్మాన్ని పాటించిన వాడు మృతుడైనా చిరంజీవి అనటంలో సందేహంలేదు.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చక్కని సూక్తి . మొదటివాడు జీవన్మృతుడు , రెండవాడు కీర్తి శేషుడు బాగుంది అందుకే అన్నాను " ఆంధ్రామృతమే ఒక మేలిమి బంగారం అని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.