గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఏప్రిల్ 2014, గురువారం

వల్మీక తాడనాదేవ మృతః కుత్ర మహోరగః ?- మేలిమి బంగారం మన సంస్కృతి 168.

జైశ్రీరామ్.
శ్లో. దేహదండనమాత్రేణ కా ముక్తిరవివేకినాం -  వల్మీక తాడనాదేవ మృతః కుత్ర మహోరగః ?
గీ. పుట్టపై కొట్టినంతలో పుట్టలోని
పాముమరణించబోదుగా! పాంసనుండు
మనసులోనుండు మలినము బాప కుండ
దేహదండన ఫలమీదు. తెలియుఁడయ్య..
భావము. (మనస్సులోని మాలిన్యాన్ని తొలగించుకోకుండా)శరీరాన్ని (ఉపవాసాదులతో) దండింపజేసుకొన్నంత మాత్రాన అవివేకులకు ముక్తి ఎక్కడిది ? పుట్టను ధ్వంసం చేసినంత మాత్రాన దానిలోని మహాసర్పం మరణిస్తుందా ! 
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిర్మల మైన మనస్సుతో ఒక్కనమస్కారం పెడితే చాలు కలుషిత బుద్ధితో ఎన్ని పూజలు ఉపవాసాలు చేసినా వృధా ప్రయాసె అవుతుంది మేలిమి బంగారం మన ఆంధ్రామృతం హేట్సాఫ్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.