గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, ఏప్రిల్ 2014, సోమవారం

దశకం ధర్మలక్షణమ్. మేలిమి బంగారం మన సంస్కృతి 183.

జైశ్రీరామ్.
శ్లో. ధృతి,క్షమా,దమో, స్తేయం శౌచ మింద్రియనిగ్రహః
ధీ ర్విద్యా సత్యమక్రోథో దశకం ధర్మలక్షణమ్.
గీ. నిత్య ధైర్య మోర్పును నాత్మ నిగ్రహంబు,
తనది కానిది కోరని ధర్మ నిరతి,
బుద్ధి, విద్య, జితేంద్రియ పూజ్యశక్తి,
కోప రహితము, సత్య సద్గుణము, సౌచ
మనెడు పదియును ధర్మలక్షణములగును.
భావము. ధైర్యం, ఓర్పు, మనోనిగ్రహం, తనది కానిదానియందు ఆశ లేకుండుట, శుచిత్వము, ఇంద్రియనిగ్రహము, బుద్ధి,సద్విద్య, సత్యము,కోపరాహిత్యం ఈ పదీ ధర్మలక్షణాలు.     
జైహింద్.   
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

దైర్యము, తనది కాని దాని పై ఆశ పెరిగినదవి, ఓర్పు,మనో నిగ్రహము తగ్గినది. శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము శూన్యమైనవి. బుద్ధి స్ధానములో దుర్భుద్ది, సద్విద్యకు స్ధానము లేదు, అసత్యము రాజ్యమేలు చున్నది. కోపము గురించి జెప్ప అవసరము లేదు.

కానీ గురువుగారు ఈ పది లక్షణములు ఉన్నా మనుజులలో సుఖ శాంతులు లేవు.

నిత్యమూ మంచి మంచి విషయములు తెలియ జేయు చున్న మీకు ధన్యవాదములు .
శిష్య పరమాణువు
వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఇన్ని ధర్మ లక్షణాలు ఒకే వ్యక్తి యందు ఉండటం అసంభవమే కానీ సాధనవలన కొన్నైనా అలవర్చు కోగలిగిన వారు ధన్యులు .ఆంధ్రామృతం లోని ఆణిముత్యాలను ఏరుకోగలిగిన వారు అదృష్ట వంతులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.