గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, మార్చి 2014, శనివారం

శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారి రాకతో కలిగిన ఆనందం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు కర్లూలు నివాసి. వీరికి చిత్ర బంధ కవితాసక్తి మెండు. వీరు సహస్రాధిక చిత్ర,బంధ,గర్భ కవితలను, తత్కవుల, కావ్యముల చరిత్రలను సేకరించి సంపుటీకరించి అచ్చొత్తించు మహత్ప్రయత్న నిమగ్నులై యున్నారు. అట్టి ప్రయత్నముతోనే  నిన్నను మా గృహమునకు విచ్చేసిన కారణముగా మాకు ఆనందము కలిగించినారు.
ఏ భాషలోనైనను, ఎట్టి కవి యైనను చిత్ర,బంధ గర్భ కవిత్వములు వెలయించి యున్నను, లేక ఎవరైనను వెలయించినవి తమ దృష్టిలో యున్నను వీరి దృష్టికి తీసుకు రావలసినదిగా అర్థించుచున్నారు.
మీరునూ అవకాశము కలిగినట్లైతే అట్టి చిత్ర,బ<ధ,గర్భ కవితలు వీరి దృష్టికి తీసుకొని వెళ్ళగలరని ఆశించుచున్నాను.
వీరి దూరవాణి సంఖ్య.9490122581.
వీరి emal ID acharya.vaidyam@gmail.com
మా యింటికి అభిమానంతో విచ్చేసిన శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారికి, వీరిని చూచుటకు విచ్చేసి మాకానందకారకులైన శ్రీ గుత్తి(జోళదరాశి)చంద్రశేఖరరెడ్డిగారికి నా ధన్యవాదములు తెలియజేసుకొంటున్నాను.
జైహింద్.
Print this post

2 comments:

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ చింతా రామ కృష్ణా రావు గురుదేవులకు పాదాభి వందనములతో ...

శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారికి పాదాభి వందనములు. వారికి నావంతు సహాయము జేయుటకు సిద్దముగానుంటిని. ఈ రోజు నుండి ప్రయత్నము జేసి బంధ, గర్భ కవితలు సేకరించెదను. వారు అతి వేగముగా పూర్తి జేయవలెనని భగవంతుని ప్రార్థిస్తూ..

శిష్య పరమాణువు
వరప్రసాదు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖులను పరిచయం చేసి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.