గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మార్చి 2014, మంగళవారం

వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభ పయోముఖమ్ - మేలిమి బంగారం మన సంస్కృతి 166.

జైశ్రీరామ్.
శ్లో. పరోక్షే కార్య హంతారం , ప్రత్యక్షే ప్రియవాదినం
వర్జయేత్తాదృశం మిత్రం విషకుంభ పయోముఖమ్.
గీ. ఎదుట ప్రీతిఁ బలుకు నెదలోన విషముండు
మన పరోక్షమందు మనలఁ జెరచు
నట్టి దుష్ట మిత్రుఁడనురాగ విరహితుఁ
డట్టివాని విడిచిపెట్టవలయు.
భావము. మన పరోక్షంలో మన పనులను నాశనం చేసేవాడు , మనకుప్రత్యక్షంగా ఉన్నపుడు ప్రియభాషణం చేసేవాడు అయిన మిత్రుణ్ణి వెంటనే వదిలిపెట్టాలి. వాడు పయోముఖ విషకుంభం లాంటివాడు.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.