గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2014, శనివారం

విద్యార్తులు ప్రదర్శిస్తున్న భువనవిజయం ఈ రోజే సాయంత్రం 6 గంటలకు.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
జగద్గిరిగుట్ట  జిల్లాపరిషద్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు కూకట్పల్లి వివేకానంద నగర్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భువనవిజయం ప్రదర్శిస్తున్నారు. శ్రీ దొరవేటి మాష్టారి శిక్షణలో వీరు ప్రబలుతున్నారు.జ్ఞాన వయో వృద్ధులైన పెద్దలు, ఆలయ నిర్వాహకులు ఈ మహోత్తమ కార్యక్రమమును చేయ తలపెట్టారు. వారిని మనసారా అభినందిస్తున్నాను.శ్రీ కృష్ణ దేవరాయలవారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రీ గుత్తి (జోళదరాశి)చంద్రశేఖర రెడ్డిగారు అలనాటి చరిత్రను వివరిస్తారు.
ఔత్సాహికులెల్లరూ విచ్చేసి చూచి అలనాటి చారిత్రకాంశాలను మరింతగా ఆకళింపు చేసుకొని భావితరాలకు అందించడంలో మీ కృషి మీరు చేయుటకు అవకాశం ఉంటుందని ఆశించి మీముందు ఈ విషయాన్ని ఉంచాను.
నమస్తే,
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.