గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, మార్చి 2014, మంగళవారం

మన తెలుగు సంవత్సరముల పేర్లు.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
తెలుగువారిమై యున్న మనకు మన తెలుగు సంవత్సరముల పేర్లు తెలియకపోతే ఎలాగ? అందుకే ఈ క్రింద ఈయఁబడినవి. గమనింప గలరు.
తెలుగు సంవత్సరములు 60 . అవి క్రీ . శ . 1987 - 88  నుండి 2047 - 48 వరకు ఈ క్రింద నీయబడినవి.
 1 . ప్రభవ         (1987 - 88)  
 2 . విభవ         (1988 -89)        
 3 . శుక్ల           (1989 -90)
 4 . ప్రమోదూత (1990 -91)
 5 . ప్రజోత్పత్తి    (1991 - 92)
 6 . అంగీరస      (1992 -93)    
 7 . శ్రీముఖ       (1993 -94)      
 8 . భవ            (1994 - 95)
 9 . యువ        (1995  - 96)  
10 . దాత          (1996 - 97)
11 . ఈశ్వర        (1997 -98)
12 . బహుధాన్య (1998 -99)
13 . ప్రమోది      (1999 -2000)
14 . విక్రమ        (2000 -01)
15 . వృష           (2001 -02)
16 . చిత్రభాను    (2002 -03)
17 . స్వభాను     (2003 -04)
18 . తారణ         (2004 -05)      
19 . పార్ధివ         (2005 - 06)
20 . వ్యయ         (2006 -07)
21 . సర్వజిత్తు    (2007 -08)
22 . సర్వధారి     (2008 -09)
23 . విరోధి          (2009 -10)
24 . వికృతి         (2010 -11)
25 . ఖర             (2011 -12)
26 . నందన        (2012 -13)
27 . విజయ        (2013 -14)
28 . జయ           (2014 -15)
29 . మన్మధ       (2015 -16)
30 . దుర్ముఖి      (2016 -17)
31 . హేవిళంభి     (2017 -18)
32 . విళంబి         (2018 -19)
33 . వికారి           (2019 -20)
34 . శార్వరి          (2020 -21)
35 . ప్లవ              (2021 -22)
36 . శుభకృతి      (2022 -23)
37 . శోభకృతు      (2023 -24)
38 . క్రోధి              (2024 -25)
39 . విశ్వావసు     (2025 -26)
40 . పరాభవ         (2026 -27)
41 . ప్లవంగ           (2027 -28)
42 . కీలక              (2028 -29)
43 . సౌమ్య           (2029 -30)
44 . సాధారణ        (2030 -31)
45 . విరోధికృతు     (2031 -32)
46 . పరీధావి         (2032 -33)
47 . ప్రమోదీచ       (2033 -34)
48 . ఆనంద          (2034 -35)
49 . రాక్షస           (2035 -36)
50 . నల               (2036 -37)
51 . పింగళ           (2037 -38)
52 . కాళయుక్తి      (2038 -39)
53 . సిద్దార్ద            (2039 -40)
54 . రౌద్రి              (2040 -41)
55 . దుర్మతి          (2041 -42)
56 . దుందుభి       (2042 -43)
57 . రుధిరోద్గారి      (2043 -44)
58 . రక్తాక్షి             (2044 -45)
59 . క్రోధన             (2045 -46)
60 . అక్షయ           (2046 -47)
జైహింద్
Print this post

4 comments:

Zilebi చెప్పారు...


ఈ పేర్లు యాద్రుచ్చికములా లేక వీటి వెనుక నిగూఢ అర్థములు (ఆ యా సంవత్సరములకు అట్లా పేరు పెట్టు టకు గల కారణములు ) ఏమైనా ఉన్నవా ? విశదీకరించ గలరు ?

The current generation always would like to know why they have been named so rather than a simple list of naming !

cheers
zilebi

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నాయనా! శుభమస్తు.
మీ సందేహం సరైనదే. ఈ సంవత్సరముల పేర్లన్నీ సంస్కృత పదములే. ఆయా సంవత్సరములలో సంభవించు ఫలితముల నాధారముగా ఆయా పేర్లు పెట్టబడినట్లు మనకవగతమౌతుంది.ప్రతీ సంవత్సరమూ సార్థకనామధేయంతోనే వరలుతోంది.కేవలం సంవత్సరం పేరును బట్టి మనం ఆ సంవత్సర ఫలం ఎలాగుంటుందో ఊహింప తగినట్టుగా ఆయా పేర్లు ఒప్పి యున్నవి. అని నా అభిప్రాయం.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చిన్నప్పుడు ఎప్పుడో చదివిన సంవత్సరముల పేర్లను మళ్ళీ గుర్తు చేసి వరుస క్రమంలో తెలియ జెప్పినందులకు ధన్య వాదములు

Unknown చెప్పారు...

చిన్ననాట నెమరు వేసిన పేర్లను గుర్తు చేసినందుకు ధన్యవాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.