గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, మార్చి 2014, శుక్రవారం

వాచా దురుక్తం బీభత్సం న సంరోహతి వాక్ క్షతం. - మేలిమి బంగారం మన సంస్కృతి 162.

జైశ్రీరామ్.
శ్లో. సంరోహత్యగ్నినా దగ్ధం వనం పరశునా హతం 
వాచా దురుక్తం బీభత్సం న సంరోహతి వాక్ క్షతం.
గీ. పరశు ఛేదితమయ్యును వనము పెరుగు.
అగ్ని దగ్ధపుటడవులునమరు మరల
దుష్టవాక్కులు కలిగించు కష్టమునకు
మనసు విరుగును హతమౌను. మనుజులకును.
భావము. అగ్నిచే దహింపబడిన , లేదా గొడ్డలిచే నరకబడిన అడవి కొంతకాలానికి క్రమంగా మళ్ళీ చిగురిస్తుంది. కానీ కఠినమైన,అనుచితమైన మాటలచే దెబ్బతిన్న మనస్సు కుదుటపడదు.

జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
నిజమె " ఇనుము విరిగెనేని ఇనుమారు ముమ్మారు " అన్నట్టు మనసు విరిగితే అతుకుపడదు చక్కని విషయాన్ని చెప్పారు .ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.