గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2013, శనివారం

శ్ర్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం.౩

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్ర్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గణపతికి చేసిన కవితామృతాభిషేకం తిలకించండి.
మహాక్కర.
పార్వతీ నందనా! హే గణేశా! కృపాకరా! మూషికవాహనా! హే
సర్వ దేవతా పూజిత ద్విదేహ శంకర తనయా! హజాననా! హే
సర్వ విఘ్న విదూర విఘ్నేశ్వరా! సకల పూజాదులన్ ప్రథమ పూజ్యా!
సర్వ కాలంబులన్ మమ్ము కావుమా! సకల విద్యాబుద్ధు లిడి బ్రోవుమా!
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.
తోపెల్ల వంశ సత్కవి
దీపించు మహాక్కరంబు దివ్యుఁడ! నీపై
నీపగిది వ్రాసి పంపిరి.
ప్రాపుగ నిలు మతని కీవు. భక్త సులభుఁడా.
తోపెల్ల సుకవికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.