గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, సెప్టెంబర్ 2013, బుధవారం

శ్రీ వేంకటేశ్వరా భక్తి చానల్(SVBC) లో డా.మాడుగుల నాగఫణి శర్మద్విశతావధానం ప్రతీ రోజూ 4PM కు ప్రసారం ఔతోంది.

జైశ్రీరామ్.
ఆర్యులారా! గత మే 30 నుండి జూన్ 3 వరకు హైటెక్స్ సమీపమున గల సరస్వతీ పీఠములో జరిగిన అష్టోత్తర ద్విశతావధానము కార్యక్రమము డా. మాడుగుల నాగఫణిశర్మగారు చేసి యున్నారు.
ఆ కార్యక్రమమును శ్రీ వేంకటేశ్వరా భక్తి చానల్ వారు ప్రతీ రోజూ మధ్యాహ్నం 4 గంటల నుండి ఒక గంట పాటు రోజూ ప్రసారము చేయుచున్నారు. సరసజ్ఞులైన పాఠకులు ఈ కార్యక్రమమును తిలకించ గలిగేటందుకు వీలుగా ఆంధ్రామృతం ద్వారా మీకు తెలియ జేస్తున్నాను.
జైహింద్.

Print this post

4 comments:

అజ్ఞాత చెప్పారు...


మంచి విషయాన్ని తెలిపారండీ !

ఇవ్వాళ నించే నా ఈ కార్యక్రమం ఆరంభం ?

జిలేబి

Pandita Nemani చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి శుభాశీస్సులు.

సరసాంధ్రామృత సాహితిప్రియ సుధాసారాకరా! సత్కవీ
శ్వర! ఆచార్య పదప్రశస్త మణిభూషా! పర్వవర్యాన సా
దర రీతిన్ వినుతింతు నీ ప్రతిభ చింతా రామకృష్ణా! సుధీ!
పరమానంద నిధానమానసుడవై భద్రంబులన్ గాంచుమా!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!పండిత వందితా! ధన్యోస్మి. ధన్యవాదములు.
ఎంతటి భాగ్యమియ్యది!మహేశ్వర సన్నిభ రామ జోగి న
న్నింతగ మెచ్చుచుండిరన నెన్నుచు పుణ్య విశేష సత్ఫలం
బంతయు నన్ను చేరుటనె.ఆంధ్ర సరస్వతి దీవనాళి నా
కింతటి శోభ గూర్చె,తమ కెట్లు వచింతు కృతజ్ఞతాంజలుల్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎక్కడెక్కడ ఉన్న వారికైనా సాహిత్యా మృతాన్ని అందిస్తూ కళ్ళకు కట్టినట్టు , వీనులకు వొందొన రించు కృషీ వలులు శ్రీ చింతా సోదరులు అభినంద నీయులు .
ఈ మధ్య నేను బోస్టన్ వెళ్ళి నందున ఆలస్యం గా చూడ గలిగాను

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.