గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2013, శనివారం

శ్రీ వర ప్రసాద్ గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం 2

జైశ్రీరామ్.

ఆర్యులారా! శ్రీ వర ప్రసాద్ గారు తన సహజ ధారా కవితామృతంతో మన వరసిద్ధి వినాయకుని అభిషేకించిన విధం చూడండి.

మూషిక వాహన!దేవ!మునిజన స్తుత్య సద్భావ!
ద్వేష రాగాది విహీన!దీవ్యద్వివేక నిధాన!

పోషిత పరిజన బృంద!పుణ్యైక కంద!సానంద!
దోష వినాశ!గణేశ!స్తోత్రమ్మొనర్తు విఘ్నేశ! 

అద్రిసుతాత్మజ!గణప!అనవద్య చరిత!విఘ్నేశ!
భద్ర గజానన!గణప!భవభయనాశ!విఘ్నేశ!
సద్రూప వైభవ!గణప!సద్భక్త వినుత! విఘ్నేశ!
భద్రగుణాకర!గణప!ప్రమథ గణేశ!విఘ్నేశ! 

అగ్రగణ్యా!మహాకాయ!ఆరోగ్యమిమ్ము విఘ్నేశ!
అగ్రపూజ్యా!మహానంద!ఆనందమిమ్ము విఘ్నేశ!
అగ్రనాయక!మహైశ్వర్య!ఐశ్వర్యమిమ్ము విఘ్నేశ!
అగ్రణీ!కవిలోక వంద్య!ఆశ్రిత రక్ష!విఘ్నేశ!


కరావలంబమిచ్చు దివ్య కాయ! ఓ వినాయకా!
వరప్రసాదు సత్ కవిత్వ  వర్ష మమృతంబుగా
స్వరాభిహేకమై తనర్చ సత్వరంబె చేసె. నీ
వరాళితో వరప్రసాదు వర్ధనంబు గొల్పుమా!
వరప్రసాదు గారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

భాషకాని భాషా ప్రాంతంలో ఉంటూ మాతృభాషపై ఎంతో మమకారంతో సాంప్రదాయబద్ద పద్య కవిత్వంలో మీరు (వరప్రసాదు గారు) చేయు ప్రయోగాలు మరింత వన్నెకెక్కాలని ఆ గణేశుని ఆశిస్సులు గురువులు శ్రీ పండిత నేమాని వారి ఆశీస్సులు సదా మీకు కలగాలని ఆగణేశుని ప్రార్థించుచూ అభినందనా ప్రసూనము.

అందంబగు పద్యంబుల
డెందంబానందమొందెడి పగిది వ్రాయన్
కందుల కుల వరధీవర!
అందుకొనుము వరప్రసాద! అభినందనముల్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.