గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జులై 2013, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 137.

జైశ్రీరామ్.
శ్లో: నరత్వం దుర్లభం లోకే - విద్యా తత్ర సు దుర్లభం.
కవిత్వం దుర్లభం తత్ర - శక్తిస్తత్ర సుదుర్లభమ్.
గీ: తొలుత జగతిని నర జన్మ దుర్లభంబు.
తోడనబ్బుట సద్విద్య దుర్లభంబు.
తుదకు సత్ కవి యగుటిల దుర్లభంబు.
దుర్లభోత్పత్తి యుతు డందు దుర్లభంబు.
భావము: లోకములో మానవ జన్మ మెత్తుట యన్నది దుర్లభమైనది. అందులోనూ విద్యా సంపాదన చేయుట మరీ దుర్లభము. చదువు అబ్బినను కవిత్వము పట్టుబడుట మరింత దుర్లభము. కవి కాగలిగినని అందులోఉత్పత్తి శక్తి కలుగువాడగుట అత్యంత దుర్లభము.
అట్టి సత్ కవిని గౌరవించు వారి జన్మమే ధన్యమైనది కదా.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఈ రోజుల్లొ అన్నిటినీ జయించి దైవ కృపవలన సత్కవి కాగలిగినా
పేరున్న వాళ్ళని పడగొట్టడమే ధ్యేయంగా బ్రతికే కొందరి నోటిలో బడి బాధ పడక తప్పటల్లేదు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.