గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

కవి వతంసను సత్కరిస్తున్న కళాతపస్వి విశ్వనాథ.

3=4x6-2c.jpg
ఆంధ్రామృతాస్వాదనా లోలులారా! శ్రీ విశ్వనాథ సత్యనారాయన రామాయన కల్ప వృక్షము న గల భావుకతను తన ఉపన్యాసముల ద్వారా సాహితీ పిపాసులకందించుచున్న మన ప్రియ మిత్రులు కవివతంస బిరుదాంకితులగు; శ్రీ బులుసు వేంకటేశ్వర్లు ప్రతిభను విన్న  సినీ దర్శకులు కళా తపస్వి బిరుదాంకితులు అగు శ్రీ విశ్వనాథ దంపతులు  రామాయణ కల్ప వృక్షమునందలి భావికతను ప్రత్యేకించి చెప్పించుకొని విని మహదానంద భరితులై  తమ యానందమును ఆ కవివతంసులికి తాము చేయు సత్కృతి ద్వారా వ్యక్తము చేసినారు. 
ఈ సన్నివేస్శమును చూచిన నా మనసు ఆనంద పారవశ్యము పొందగా పొంగివచ్చిన కంద గీత గర్భ చంపకమాలను రసజ్ఞుల హృదయాహ్లాదకరమని భావించి; ఇందుంచినాడను. विद्वानॆव विजानाति विद्वज्जन परिश्रमम् అన్నారు మహానుభావులు. అట్టి మీకు ఇందలి స్వారశ్యమును చెప్పంబనిలేదు. గ్రహింపఁ గలరని నా విశ్వాసము.
చ:- అవనతుఁడయ్యె గా! వినయ హారతి నిచ్చుచు విశ్వనాథ! రా
జ వదనుడై! సఖీ సహిత సన్మన గౌరవ సత్కృతంబుతో!
కవి నుతుడంచు; నీ కవికి గణ్యతఁ నారసి; గారవించె. జ్ఞా
న వివశుడై! భువిన్  బులుసు నైపుణి వాగ్ఝరి పూజ లందెగా!
క:- నతుఁడయ్యె గా! వినయ హా
రతి నిచ్చుచువిశ్వనాథ; రాజ వదనుడై!
నుతుడంచు; నీ కవికి గ
ణ్యతఁ నారసి; గారవించె జ్ఞాన వివశుడై!
తే.గీ:- వినయ హారతి నిచ్చుచువిశ్వనాథ
సహిత సన్మన గౌరవ సత్కృతంబు
కవికి గణ్యతఁ నారసి;గారవించె!
బులుసు నైపుణి; వాగ్ఝరి; పూజ లందె!

ప్రతిభా పాండిత్యములు దశ దిశలా వెన్నెల; చల్లదనము లవలె వ్యాపించగా సుప్రసిద్ధమైన  కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారికి; దేశ విదేశాలలో కీర్తి కాంతులతో ప్రసిద్ధులైన ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకులు శ్రీ విశ్వనాథ దంపతులను ఆంధ్రామృతం తరపున; పాఠకుల తరపునా అభినంది స్తున్నాను. 
జైహింద్
Print this post

2 comments:

Unknown చెప్పారు...

ఫొటో స్పష్టంగా కన్పించటం లేదండీ !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.సరస్వతీ పుత్రులు సాహితీ స్రష్ట " శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు " విశ్వనాధ వారి కల్ప వృక్షము నందలి " భావ పరంపరను తమ ఉపన్యాసముల ద్వారా సాహితీ పిపాసకులకు అందించటమే గాక " కళా తపశ్వి శ్రీ విశ్వనాధ దంపతులచే " సత్కరింప బడు భాగ్యము నొందుట సాహితీ అభిమాను లందరికీ ముదావహం + గర్వకారణం.అదృష్ట వంతులు. ఇంతటి ఆనందాన్ని " వివిధ ఛంధస్సులలొ " పంచి మైమరపించగ సోదరుడు రామ కృష్ణా రావు గారు అభినంద నీయులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.