గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం 13.

సదసద్వివేచనా శీలీ! ఈ క్రింది పద్యాన్ని పఠించి అంతర్లీనమైయున్న సమాధానం చెప్పండి.
క:-
శుద్ధ కుల జాత యొక సతి
యిద్ధరణిన్ దండ్రిఁ జంపి యెసగ విశుద్ధిన్
బుద్ధి బితామహుఁ బొందుచు
సిద్ధముగా దండ్రిఁ గనును. చెప్పుడు దీనిన్.

ఆలోచించాలే గాని మీరు చెప్పలేకపోవడమేమిటి? ఆలోచించి సరైన సమాధానం చెప్పండి.
నమస్తే.

జైహింద్.

Print this post

2 comments:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

తియ్యని మజ్జిగ వచ్చెను
నెయ్యముగా పెరుగు చిలుక నెరజాణ వలెన్
అయ్యది పాలను కలువగ
వయ్యరముతోడ మరల వచ్చెను పెరుగే!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అయ్యా! చక్కగ చెప్పిరి.
నెయ్యముచే నెయ్య వచ్చె. నేర్పరివయ్యా!
వయ్యర మది వయ్యారము.
చయ్యన పలికెడు ఫణిప్రసన్నకుమారా!

చక్కని మీ ఆసుధారనభినందిస్తున్నాను.
ధన్యవదములు.!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.